తల తెగిన భారీ పాము.. మనిషిని కాటేసేందుకు ఎలా పాకుతుందో చూడండి..!

Headless Snake Appears To Attack Man : ఈ పాముకు తల లేదు. అయినా బతికేసింది.. తల లేకుండా మొండెంతోనే పాకుతోంది. బీచ్‌లో ప్రత్యక్షమైన ఈ తల తెగిన పాము అక్కడి వ్యక్తిని కాటేయబోయింది. పాకుతున్న పామును వీడియో తీసిన వ్యక్తి టెన్నిస్ రాకెట్‌తో దాన్ని దూరంగా నెట్టేస్తున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వాస్తవానికి ఆస్ట్రేలియాలో బీచ్‌లోది.. తల లేకుండా పాము ఎలా బతికింది.. పైగా పాకుతోంది కూడా.. అంటూ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పాము తల ఏదో పక్షో కొరికేసినట్టుగా కనిపిస్తోంది. భారీ పామును ఎత్తుకెళ్లిన రాబాందు లేదా గద్ద లాంటి పక్షి దాన్ని ఇలా బీచ్ లో పడేసి ఉంటుందని వీడియో తీసిన వ్యక్తి అంటున్నాడు.
అక్కడే కొన్ని పక్షులు ఆకాశంలో ఎగరడాన్ని చూసానని చెప్పాడు. సాధారణంగా పాములు చనిపోయాక కూడా కొంతసేపు కదులుతుంటాయి. ఎక్కువగా పాము తోక కదులుతుంటుంది.
పాము శరీరంలోని ఐయాన్స్, ఎలక్ట్రికల్ విద్యుత్ కణాలు కొన్ని గంటల పాటు అలానే పనిచేస్తాయి. దీని కారణంగా పాము శరీరంలోని కండరాలు వ్యాకోచించడం జరుగుతుంది. తద్వారా పాము చనిపోయినా ముందుకు కదలుతుంది. తల భాగాన్ని కోల్పోయినప్పటికీ పాము సాధారణ శరీరంలో కొంతవరకు రిఫ్లెక్సివ్ యాక్షన్ ఉంటుంది.
పాము చనిపోయినప్పటికీ.. తల లేకపోయినా పాములు కాటేయగలవంట.. విషాన్ని కూడా ఇంజెక్ట్ చేయగలవని అంటున్నారు. ఏదిఏమైనా తలలేని పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తల లేకుండా పాము ఎలా పాకుతుందో మీరూ ఓసారి చూడండి.