‘క్రాక్’ కి కష్టాలెందుకొచ్చాయ్.. ‘టెంపర్’ రీమేకే కారణమా?

‘క్రాక్’ కి కష్టాలెందుకొచ్చాయ్.. ‘టెంపర్’ రీమేకే కారణమా?

Updated On : January 9, 2021 / 7:56 PM IST

Krack Movie: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. నిర్మాత ‘ఠాగూర్’ మధు ఆర్థిక వివాదంలో ఇరుకున్న కారణంగా ఈరోజు ఉదయం నుండి ఎక్కడా థియేటర్లలో షోలు పడలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.

మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అవగా సాయంత్రం ఫస్ట్ షో నుండి షోలు పడ్డాయి. అసలు సినిమా సకాలంలో విడుదల కాకపోవడానికి కారణం ఏంటి అంటే నిర్మాత గతంలో ఓ సినిమా విషయంలో చేసిన ఆలస్యమే ఇప్పుడు ‘క్రాక్’ రిలీజ్ కొంపముంచిందని తెలిసింది.

వివరాళ్లోకి వెళ్తే.. ‘ఠాగూర్’ మధు చిన్న నిర్మాత ఏం కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ ని గతేడాది విశాల్ హీరోగా తమిళ్‌లో రీమేక్ చేశారు మధు. ఆ సమయంలో ఆయన అక్కడి ఫైనాన్షియర్‌కి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉండగా తర్వాత ఇస్తానని చెప్పారు.

తనకు రావాల్సిన డబ్బులివ్వకుండా మరో సినిమా ఎలా రిలీజ్ చేస్తావ్.. ఇవ్వాల్సిన రూ.రెండున్నర కోట్లు దానికి వడ్డీ వంటి లెక్కలతో కలిపి మొత్తంగా రూ.నాలుగు కోట్లు ఇవ్వాల్విందేనంటూ సదరు ఫైనాన్షియర్ చెన్నై కోర్టులో కేస్ వేయడంతో విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు వివాదం పరిష్కారమవడంతో థియేటర్లలో బొమ్మ పడింది.