WhatsApp Users : రెండు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ నెంబర్ ఎలా కనెక్ట్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!
WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. వాట్సాప్ యూజర్లు రెండు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ నంబర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన లింక్డ్ డివైజ్ ఫీచర్ మరింత విస్తరించనుంది.

How to use one WhatsApp number on two mobile phones
WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. వాట్సాప్ యూజర్లు రెండు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ నంబర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన లింక్డ్ డివైజ్ ఫీచర్ మరింత విస్తరించనుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ల బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. రాబోయే నెలల్లో వాట్సాప్ ఫీచర్ అందరికీ అందుబాటులో రావచ్చు. వాట్సాప్ (WhatsApp) యూజర్లందరూ ప్రస్తుత అకౌంట్ ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. యూజర్లు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు వంటి నాలుగు ఇతర డివైజ్‌లకు లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఇప్పుడు రెండు ఫోన్‌లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇకపై రెండు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. రెండు మొబైల్ నెంబర్లకు ఒకటే వాట్సాప్ నెంబర్ వినియోగించుకోవచ్చు. నిర్దిష్ట అకౌంట్‌కు ప్రస్తుతం ఎన్ని డివైజ్ లాగిన్ అయ్యాయో చెక్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలను చెక్ చేసేందుకు యూజర్లను అనుమతించేందుకు WhatsApp కూడా అందిస్తుంది. వాట్సాప్ యూజర్లకు కొంత సెక్యూరిటీని కూడా అందిస్తుంది. వాట్సాప్ అకౌంట్ తెలియని డివైజ్‌లో పనిచేస్తుందో లేదో తెలియకపోవచ్చు. వాట్సాప్ WhatsApp యూజర్లు రిమోట్‌గా ఏదైనా డివైజ్ నుంచి లాగ్ అవుట్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు మీ ప్రైమరీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
రెండు మొబైల్ ఫోన్‌లలో ఒక వాట్సాప్ నంబర్‌ను ఎలా ఉపయోగించాలంటే? :
WhatsApp కొత్త ఫీచర్‌ను ప్రయత్నించాలనుకునే యూజర్లు ముందుగా మెసేజింగ్ యాప్ బీటా వెర్షన్‌లో సైన్ అప్ చేయాలి. యాప్ బీటా ప్రోగ్రామ్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ప్రయత్నించవచ్చు. Google Play Storeకి వెళ్లి WhatsApp యాప్ కోసం సెర్చ్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పేజీలో బీటా ప్రోగ్రామ్ ద్వారా ఉపయోగించవచ్చు. మీరు సైన్ అప్ చేయలేరు. బీటా ప్రోగ్రామ్ కోసం ప్లే స్టోర్‌ని చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల కోసం రెండు మొబైల్ ఫోన్‌లలో ఒక వాట్సాప్ నంబర్‌ను ఎలా ఉపయోగించవచ్చు.

How to use one WhatsApp number on two mobile phones
WhatsApp లింక్ డివైజ్‌లో ప్రైమరీ ఫోన్ ఎలా ఉపయోగించాలంటే? :
– మీ ప్రైమరీ మొబైల్ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
– కుడి టాప్ కార్నర్ కనిపించే త్రి డాట్స్ ఐకాన్‌పై Tap చేయండి.
– Linked devicesపై మళ్లీ Tap చేయండి.
– స్క్రీన్‌పై QR కోడ్‌ని ‘link a device’ ఆప్షన్‌పై Tap చేయండి.
సెకండరీ ఫోన్ ఎలా కనెక్ట్ చేయాలంటే? :
– మీరు బీటా ప్రోగ్రామ్‌కు సైన్ అప్ చేసిన తర్వాత.. యాక్టివేట్ చేసేందుకు మీరు వేరే ఏమీ చేయనవసరం లేదు.
– మీ సెకండరీ మొబైల్ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ చేయండి.
– ఇప్పుడు, స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న Three Dot Menu ఐకాన్‌పై Tap చేయండి.
– Link a device” ఆప్షన్‌పై మళ్లీ Tap చేయండి.
– ఇప్పుడు, మీరు ప్రైమరీ ఫోన్‌లో అందుబాటులో ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..