Tejas: స్వదేశీ యుద్ద విమానంలో ప్రయాణించిన వాయు సేన చీఫ్

IAF chief flew in indian made tejas
Tejas: పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శనివారం ప్రయాణించారు. రెండు రోజులు పర్యటన నిమిత్తం ఆయన ప్రస్తుతం బెంగళూర్లో ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్వదేశంలో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే1 తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్, హెచ్‌టీటీ-40లను ఆయన పరీక్షిస్తారు. వీటిని త్వరలో భారత వాయు సేనలోకి ప్రవేశ పెట్టనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా ప్రకటించింది. స్వయం సమృద్ధ భారత్ పథకం దిశగా ఐఏఎఫ్ చేస్తున్న కృషిలో ఇది భాగమని ఐఏఎఫ్ తెలిపింది.
మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా మన దేశంలోనే 96 అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రణాళికలు రచించింది. దీని కోసం అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 70 శాతాన్ని నగదు రూపంలోనే చెల్లించబోతున్నారట. 36 విమానాలకు కొంత సొమ్ము భారతీయ కరెన్సీలోనూ, కొంత సొమ్ము విదేశీ కరెన్సీలోనూ చెల్లించనుండగా.. 60 విమానాలకు పూర్తిగా మన దేశ కరెన్సీలోనే చెల్లించనున్నట్లు సమాచారం.
NITI Aayog meeting: నిధులు, మినహాయింపులు కావాలి: నీతి అయోగ్ సమావేశంలో సీఎంలు