Ind vs Eng T20I Series: మూడవ మ్యాచ్ ఇంగ్లండ్‌దే.. రాణించిన బట్లర్..

Ind vs Eng T20I Series: మూడవ మ్యాచ్ ఇంగ్లండ్‌దే.. రాణించిన బట్లర్..

Ind Vs Eng T20i Series Jos Buttlers Unbeaten 83 Helps England To An Eight Wicket Win Over India1

Updated On : March 17, 2021 / 7:24 AM IST

Ind vs Eng T20I: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 157పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ అలవోకగా చేధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ మరో 10బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో ఐదు టీ 20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది.

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ 83 పరుగుల ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చగా.. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో 2–1 ఆధిక్యం సాధించింది. జేసన్‌ రాయ్‌ 9 పరుగులు, డేవిడ్‌ మలన్‌ 18 పరుగులకే వెనుదిరిగినా.. ఓపెనర్‌ బట్లర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. జానీ బెయిర్‌స్టో కూడా దూకుడుగా ఆడాడు. 28బంతుల్లో 40రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్‌, సుందర్‌కు చెరో వికెట్‌ దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ భారత్.. 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కోహ్లీ 46 బంతుల్లో 77రన్స్‌ చేశాడు. ఓపెనర్లు రాణించలేదు. రోహిత్‌ శర్మ 15 పరుగులు చేస్తే రాహుల్‌ డకౌట్‌ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బకొట్టాడు. క్రిస్‌ జోర్డాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

రేపు(17 మార్చి 2021) జరగబోయే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఐదవ మ్యాచ్ డూ ఆర్ డైగా మారుతుంది. రేపటి మ్యాచ్‌లో ఓడిపోతే.. టీమిండియా సిరీస్ ఓడిపోతుంది.