IPS Officer Amith Lodha : ఐపీఎస్ అధికారి అమిత్ లోధా ఏ తప్పూ చేయలేదు

ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిన్నటి దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. తను రాసిన 'బీహార్ డైరీస్' పుస్తకాన్ని ఓ ప్రైవేట సంస్థకు విక్రయించి లాభాలను గడించారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆయన ఏ తప్పు చేయలేదని రుజువు కావడంతో కేసులు కొట్టివేశారు.

Amith Lodha : సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ బీహార్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ ఆయనపై ఆరోపణలు చేసింది. ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారంటూ గతేడాది పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసింది. అయితే ఆయన ఏ తప్పు చేయలేదని రుజువు కావడంతో కేసులు కొట్టిపారేశారు.

IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?

ప్రఖ్యాత నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్-డ్రామా సిరీస్ ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ స్ఫూర్తినిచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా ప్రస్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.. ఆర్థిక ప్రయోజనాల కోసం తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై గతేడాది బీహర్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు లోధా ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. అది ఆయనకు ఆర్ధిక లాభాలను కలిగించిందని పోలీసులు చెప్పారు. లోధా ఒక పుస్తకాన్ని రాసి దానిని ఆర్ధిక ప్రయోజనాలకు వాడుకోమనే అధికారం ఆయనకు లేదని పోలీసులు 2022 లో చేసిన ఓ ప్రకటనలో చెప్పారు.

 

 

అమిత్ లోధా రాసిన పుస్తకం ‘బీహార్ డైరీస్’ విడుదలైన తరువాత నెట్ ఫ్లిక్స్ సిరీస్ రిలీజైంది. కరణ్ టాకర్ మరియు అవినాష్ తివారీ నటించిన ఈ షోను నీరజ్ పాండే రూపొందించారు. భావ్ ధూలియా డైరెక్ట్ చేశారు. ఈ కథ మొత్తం అమిత్ లోధా రియల్ స్టోరీ అని కూడా చెబుతారు. అయితే ఈ ఆరోపణల నుంచి అమిత్ లోధా బయటపడ్డారు. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని రుజువు కావడంతో కేసులు కొట్టి పారేశారు.

Arun Bothra IPS : ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా అలా మోసపోయారేంటి?

అమిత్ లోధా సర్వీసులోకి రాకముందు ఐఐటీ గ్రాడ్యుయేట్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో 1995 పూర్వ విద్యార్థి.. 1998లో IPSలో చేరారు. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన ‘బీహార్ డైరీస్’తో సహా అనేక పుస్తకాలను కూడా వ్రాసారు.

ట్రెండింగ్ వార్తలు