IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?

IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎక్కడ శిక్షణ ఇస్తారు? ఎంత కాలం ట్రైనింగ్ ఉంటుంది? ఎంత శాలరీ ఇస్తారు? వారికి ఎలాంటి ప్రయోజనాలు, సౌకర్యాలు ఉంటాయి.

IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?

IAS IPS Salary (Photo : Google)

IAS IPS Salary And Training : యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వచ్చేశాయి. 2022 సంవత్సరానికి మొత్తం 933 మందిని యూపీఎస్సీ సెలెక్ట్ చేసింది. జనరల్‌ కోటాలో 345 మంది ఎంపికయ్యారు. ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263 మందిని సెలెక్ట్ చేశారు. ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది సెలెక్ట్ అయిన వారిలో ఉన్నారు. ఇక, పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది సెలెక్ట్ అయ్యారు. ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికయ్యారు.

ఇక.. ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్), ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) లకు ఎక్కడ శిక్షణ ఇస్తారు? ఎంత కాలం ట్రైనింగ్ ఉంటుంది? ఎంత శాలరీ ఇస్తారు? వారికి ఎలాంటి ప్రయోజనాలు, సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర వివరాల్లోకి వెళితే..

అందరికీ బేసిక్ ట్రైనింగ్..
సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అందరికీ (IAS, IPS, IFS, IRS) తొలుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో ఉన్న లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాథమిక శిక్షణ (బేసిక్ ట్రైనింగ్) ఇస్తారు. ఇక్కడ ఇచ్చే శిక్షణని ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఇది 4 నెలల పాటు ఉంటుంది. ఇది అన్ని సర్వీసెస్ వారికి కామన్. ఎవరూ ఎక్కువ తక్కువ కాదనే భావనను ఇక్కడ బోధిస్తారు. అలాగే పరిపాలనలో బేసిక్ విషయాలను ఈ 4 నెలల్లో టీచ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రొబేషనర్లు తమ విభాగాలు ఇచ్చే శిక్షణ కోసం ఆయా ట్రైనింగ్ సెంటర్లకు వెళతారు.

Also Read..Mahesh Bhagwat : సార్.. మీరు సూపర్.. మహేశ్‌ భగవత్‌ శిక్షణలో 125 మందికి సివిల్స్‌లో ర్యాంకులు

ఐపీఎస్‌లకు హైదరాబాద్‌లో శిక్షణ:
తర్వాత ఐఏఎస్ అధికారుల శిక్షణ అక్కడే(ముస్సోరీ) కొనసాగితే, ఐపీఎస్ అధికారులను పోలీస్ శిక్షణ కోసం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి తరలిస్తారు. శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన రాష్ట్రంలో కూడా వివిధ కార్యాలయాల్లో అధికారులు పని చేయాల్సి ఉంటుంది. ఐపీఎస్ లకు 11 నెలల ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత జిల్లాల్లో శిక్షణ ఉంటుంది. ఆపై మళ్లీ ఒక నెల పోలీసు అకాడెమీలో ట్రైనింగ్ ఇవ్వడంతో వారి శిక్షణ ముగుస్తుంది.

ఐ‌ఏ‌ఎస్ అంటే కలెక్టర్ హోదా (తత్సమాన) కోసం ఎంపిక కాబడిన వారు మాత్రం మరో రెండేళ్ళు ఇక్కడే(ముస్సోరీలో) ఉండి నేర్చుకుంటారు. ఇందులో భారత దర్శన్ అనే యాత్ర, పార్లమెంటరీ స్టడీస్ కూడా ఉంటాయి. ఐ‌పీఎస్ అంటే పోలీసు విభాగంలో ఎంపిక కాబడిన వారు తెలంగాణ రాష్ట్రంలోని సర్దార్ వల్లభ భాయ్ పోలీస్ అకాడెమీలో శిక్షణ పొందుతారు. ఇక్కడ 11 నెలల ట్రైనింగ్ ఉంటుంది. అనంతరం జిల్లాల్లో శిక్షణ ఉంటుంది. ఆపై మళ్ళీ ఒక నెల పోలీసు అకాడెమీ లో ట్రైనింగ్ ఉంటుంది. దాంతో వారి శిక్షణ ముగుస్తుంది.

ఇక ఫారెస్ట్ సర్వీస్ వారికి ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీ (డెహ్రాడూన్).. ఫారిన్ సర్వీస్ వారికి ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ (ఢిల్లీ), రెవెన్యూ సర్వీస్ వారికి నేషనల్ అకాడెమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (నాగ్ పూర్), కస్టమ్స్ ఎక్సైజ్ వారికి ఫరీదాబాద్ లో శిక్షణా కేంద్రాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఐఏఎస్‌లకు ఎంత జీతం ఇస్తారంటే..
ఐఏఎస్ ఆఫీసర్ కి ప్రారంభ జీతం రూ.56,100. 8ఏళ్ల సర్వీస్ అయ్యాక జీతం రూ.1,31,249 లేదంటే ఏడాదికి 15.75 లక్షలు ఇస్తారు. ఐఏఎస్ గరిష్ట వేతనం రూ.2,50,000. 7 వేతన కమిషన్ కింద బేసిక్ వేతనంగా రూ.56వేల 100 తో పాటుగా ట్రావెలింగ్ అలవెన్స్, డియర్ నెస్ అలవెన్స్ తో పాటుగా ఇతర అలవెన్స్ లు ఉంటాయి.

UPSC Result 2023 : సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. నారాయణపేట ఎస్పీ కూతురికి థర్డ్ ర్యాంక్

ఒక IAS అధికారి కేబినెట్ సెక్రటరీ పదవికి చేరుకుంటే జీతం రూ.2.5 లక్షలు ఇస్తారు. నాలుగో సంవత్సరం వరకు పని చేస్తే రూ.56,100 ఇస్తారు. 5 సంవత్సరం నుండి 8వ సంవత్సరము వరకు డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రెటరీ పోస్టుల్లో పని చేస్తారు. ఆ సమయంలో వాళ్ళకి రూ.67వేల 700 జీతం ఇస్తారు. పదవీ కాలం బట్టి జీతం పెరుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఉంటాయి.

34వ ఏడాది నుండి 36 దాకా చీఫ్ సెక్రటరీగా పని చేయాలి. జీతం రూ.2.25 లక్షలు ఇస్తారు. 37 ఏళ్లకు పైగా కెరీర్ ఉంటే కేబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇస్తారు. పే బ్యాండ్ ఆధారంగా ఐఏఎస్ అధికారులకు ఇల్లు, వంట మనిషి, గృహ సంబంధిత సిబ్బందితో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఏ విభాగంలో అయినా ఐఏఎస్ అధికారికి ప్రభుత్వ గృహం కేటాయిస్తారు. కారు డ్రైవర్ కూడా ఉంటారు.

ఐపీఎస్ అధికారి వేతనం..
ఐపీఎస్ అధికారికి ప్రారంభ వేతనం రూ.56,100. 8ఏళ్ల సర్వీస్ తర్వాత రూ.లక్ష 31 వేలు లేదంటే సంవత్సరానికి 15.75 లక్షలు. ఐపీఎస్ గరిష్ట వేతనం రూ.2లక్షల 25వేలు. ప్రారంభ వేతనం 15,600 నుండి 39,100. 20 ఏళ్ల సర్వీస్ తర్వాత నెలకి 37,400 నుండి 67వేలు. గరిష్ట వేతనం 90వేలు.

ఐఎఫ్ఎస్ అధికారి శాలరీ..
నెలకి 60వేలు వరకు ఇస్తారు. టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.