Mahesh Bhagwat : సార్.. మీరు సూపర్.. మహేశ్ భగవత్ శిక్షణలో 125 మందికి సివిల్స్‌లో ర్యాంకులు
Mahesh Bhagwat : ఇంటర్వ్యూ సబ్జెక్ట్ చెప్పాను. మొత్తం 700 మందికి బోధించాను. అందులో 120 నుండి 150 మందికి ర్యాంకులు వచ్చాయి

CP Mahesh Bhagwat
UPSC Civils Results 2022: పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ర్యాంకుల పంట పండించారు. మహేష్ భగవత్ శిక్షణ ఇచ్చిన 125 మందికి ర్యాంకుల వచ్చాయి. మహేశ్ భగవత్ పోలీస్ కమిషనర్ గా పని చేస్తూనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఆయన దగ్గర శిక్షణ పొందిన వారికి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు వచ్చాయి. ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్స్ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి శిక్షణ ఇచ్చింది మహేశ్ భగవతే కావడం విశేషం. మొత్తం 125 మంది ర్యాంకులు సాధించారు.
దీనిపై మహేశ్ భగవత్ స్పందించారు. విద్యార్థులకు బోధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ”నేను ఇంటర్వ్యూ సబ్జెక్ట్ చెప్పాను. మొత్తం 700 మందికి బోధించాను. అందులో 120 నుండి 150 మందికి ర్యాంకులు వచ్చాయి. ర్యాంకులు సాధించిన వారు నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలి” అని మహేశ్ భగవత్ అన్నారు.
మహేశ్ భగవత్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు..
ర్యాంక్ 1 – ఇషితా కిషోర్ (యూపీ)
ర్యాంక్ 14 – కృతిక్ గోయల్ (హర్యానా)
ర్యాంక్ 22- GVS పవన్ దత్త
ర్యాంక్ 25 – కాశ్మీర సాంకేత్
ర్యాంక్ 35 – అజ్మీరా సాంకేత్ కుమార్
ర్యాంక్ 38 – అనూప్ దాస్
ర్యాంక్ 54 – రిచా కులకర్ణి
ర్యాంక్ 74 – అయిషి జాయిన్
ర్యాంక్ 76 – వసంత్ దాభోల్కర్
ర్యాంక్ 78 – ఉత్కర్ష కుమార్ (తెలంగాణ)