UPSC Result 2023 : సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. నారాయణపేట ఎస్పీ కూతురికి థర్డ్ ర్యాంక్

UPSC Result 2023 : సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

UPSC Result 2023 : సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. నారాయణపేట ఎస్పీ కూతురికి థర్డ్ ర్యాంక్

UPSC Result 2023

UPSC Result 2023 – Uma Harathi : యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగుతేజాలు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ర్యాంకులతో మెరిశారు. తెలంగాణకు చెందిన యువతీ యువకులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఉమా హారతి జాతీయ స్థాయిలో థర్డ్ ర్యాంక్ సాధించారు. ఉమా హారతి నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు. ఉమా హారతి హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. సివిల్ సర్వీస్ లో నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం విశేషం.

ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. తిరుపతికి చెందిన పవన్ దత్తాకు ఆల్ ఇండియా స్థాయిలో 22వ ర్యాంకు వచ్చింది. హర్షిత్ కు 40వ ర్యాంక్, పవన్ కు 55వ ర్యాంక్, అర్నవ్ మిశ్రాకు 56వ ర్యాంక్, సాయి ప్రణవ్ కు 62వ ర్యాంకు వచ్చింది.

ఇక కరీంనగర్ వాసి సాయికృష్ణ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 94 వ ర్యాంక్ సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ కు చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి ఆల్ ఇండియా ఫలితాల్లో 132వ ర్యాంకు సాధించారు. UPSC సివిల్స్ ఫలితాల్లో కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన డోంగ్రి రేవయ్యకు ఆల్ ఇండియా స్థాయిలో 410 ర్యాంక్ వచ్చింది.

Also Read..Gold Merchant Association: 2వేల నోట్లు రద్దుతో గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయా..? కావాలనే అలా చెబుతున్నారా..

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. టాప్ 4 ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. ఇషితా కిషోర్ తొలి ర్యాంక్ సాధించారు. గరిమా లోహియా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంకర్ ఉమా హారతి, నాలుగో ర్యాంక్ స్మృతి మిశ్రా సాధించారు.

సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను సోమవారం(మే 23) విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మందిలో 180 మంది ఐఏఎస్ కు ఎంపిక అయ్యారు. 200 మంది ఐపీఎస్ కు, 38 మంది ఐఎఫ్ఎస్ కు, 473 మంది గ్రూప్ ఏ కేంద్ర సర్వీసులకు, 131 మంది గ్రూప్-డి సర్వీసులకు ఎంపికయ్యారు. మొత్తం 933 మందిలో జనరల్ కేటగిరీలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99 మంది, ఓబీసీ కేటగిరిలో 263 మంది, ఎస్సీ కేటగిరిలో 154 మంది, ఎస్టీ కేటగిరిలో 32మంది ఎంపికయ్యారు.

Also Read..Mahesh Bhagwat : సార్.. మీరు సూపర్.. మహేశ్‌ భగవత్‌ శిక్షణలో 125 మందికి సివిల్స్‌లో ర్యాంకులు

గతేడాది జూన్ 5న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 11 లక్షల మందికిపై అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాది జూన్ 22న ప్రిలిమినరీ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్ గతేడాది సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగ్గా.. ఫలితాలు డిసెంబర్ 6న విడుదల అయ్యాయి. 2023 మే 18న ఇంటర్వ్యూలు నిర్వహించగా, ఇవాళ(మే 23) తుది ఫలితాలు విడుదలయ్యాయి.