Gold Merchant Association: 2వేల నోట్లు రద్దుతో గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయా..? కావాలనే అలా చెబుతున్నారా..

గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు ..

Gold Merchant Association: 2వేల నోట్లు రద్దుతో గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయా..? కావాలనే అలా చెబుతున్నారా..

2000 Notes ban

KSR Naidu: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత శుక్రవారం రూ.2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీవద్ద రూ.2వేల నోటు ఉంటే బ్యాంకుల్లో, ఇతర దుకాణాల్లో మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు నుంచి రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ బ్యాంకుల్లో ప్రారంభం కానుంది. ఏ బ్యాంకుకు వెళ్లినా రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ తాజా నిర్ణయం సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే, రూ. 2వేల నోట్ల రద్దు నేపథ్యలో బడా బాబులు ఆ నోట్లను వదిలించుకొనేందుకు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2000 Notes ban: బంగారం దుకాణాల‌వైపు బడా బాబుల పరుగు.. రూ. 2వేల నోట్లు మార్చుకొనేందుకు కొత్త మార్గాలు..

బడా బాబులు రూ. 2వేల నోట్లు ఇచ్చి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారని, గోల్డ్ వ్యాపారులు 2,000 నోట్లు తీసుకొని అధిక ధరకు బంగారాన్ని విక్రయాలు చేస్తున్నారని సమాచారం. బంగారం 10 గ్రాములు ధర సుమారు రూ. 63,800 (జీఎస్టీతో కలుపుకొని) ఉంది. అయితే, రూ. 2వేల నోట్లు తీసుకొని 10 గ్రాముల బంగారాన్ని రూ. 67వేలకు విక్రయాలు చేస్తున్నారట. తమ వద్ద 2వేల నోట్లను వదిలించుకొనేందుకు అధిక ధర అయినా బడా బాబులు గోల్డ్‌ను కొనుగోలు చేస్తున్నారని ప్రచారంలో జరుగుతుంది. ఇది కేవలం ప్రచారమేనట. కావాలనే కొంతమంది గోల్డ్ కొనుగోలు పెరిగిందని చెప్తున్నారట.

RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

విజయవాడ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు పెరగలేదని చెప్పారు. రూ. 2,000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయనేది అవాస్తవం. కావాలనే కొంతమంది గోల్డ్ కొనుగోలు పెరిగిందని చెప్తున్నారు. లోకల్ మార్కెట్‌తో పాటు పెద్దపెద్ద జువెలరీ షాపుల్లోకూడా గోల్డ్ కొనుగోలు అంతగా లేదు. గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పూర్తిగా సమాచారం ఎప్పటికప్పుడు మా దగ్గరికి వస్తుంది అంటూ కేఎస్ఆర్ నాయుడు చెప్పారు. అయితే, ప్రధాన మంత్రి నోట్లు రద్దు చేయడం శుభపరిణామం అని ఆయన అన్నారు.