Naresh59: అల్లు నరేష్ కొత్త సినిమా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’!

ఇప్పుడంటే అందరూ కామెడీ టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు కానీ ఇంతకు ముంది తెలుగులో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండే హీరోలలో అల్లరి నరేష్ ముందుంటాడు. మీడియం బడ్జెక్టుతో నరేష్ తో సినిమా..

Naresh59: అల్లు నరేష్ కొత్త సినిమా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’!

Naresh59

Naresh59: ఇప్పుడంటే అందరూ కామెడీ టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు కానీ ఇంతకు ముంది తెలుగులో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండే హీరోలలో అల్లరి నరేష్ ముందుంటాడు. మీడియం బడ్జెక్టుతో నరేష్ తో సినిమా చేస్తే తమ డబ్బు ఎక్కడకి పోదనే టాక్ ఉండేది అప్పట్లో నిర్మాతల్లో. అందుకే సినిమాల మీద సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు నరేష్. ఏడాది ఏడెనిమిది సినిమాలు రిలీజ్ చేసిన క్రెడిట్ కూడా నరేష్ సొంతం.

Allari Naresh : అల్లరి నరేష్ కొత్త సినిమా ముహూర్తం

అయితే.. కథల ఎంపిక, పేరడీలు ఎక్కువ అవడంతో ప్రేక్షకులకు ఆ కామెడీ మొహం మొత్తేసింది. దీంతో కాస్త విరామం తీసుకున్న నరేష్ ఈసారి కామెడీని మించి కథలే బలంగా సినిమాలతో వస్తున్నాడు. అలా గత ఏడాది వచ్చింది నాంది. ఓ సీరియస్ కథాంశంతో వచ్చిన నాంది నరేష్ తో పాటు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలకు సక్సెస్ ఇచ్చింది. ఈ కథను మెచ్చిన బాలీవుడ్ ఇప్పుడు రీమేక్ చేస్తుంది.

Sabhaku Namaskaram : ‘అల్లరి’ నరేష్ 58.. ‘సభకు నమస్కారం’..

కాగా, ప్రస్తుతం నరేష్ ‘సభకు నమస్కారం’ అనే సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. నాంది ఇచ్చిన సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన నరేష్ తన కెరీర్ లో 59వ సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. ఎ.రాజ మోహన్ దర్శకత్వంలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలవగా.. తాజాగా శ్రీరామ నవమి సంధర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ ప్రకటించి సినిమా మీద అటెన్షన్ క్రిటిక్ చేసింది యూనిట్. ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టి అల్లరోడు మళ్ళీ ట్రాక్ మీదకి వస్తాడా అన్నది చూడాలి.