Jagame Thandhiram : 190 దేశాలు 17 భాషల్లో ధనుష్ సినిమా..

‘అసురన్’ లాంటి వైవిధ్యమైన కథతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

Jagame Thandhiram : 190 దేశాలు 17 భాషల్లో ధనుష్ సినిమా..

Jagame Thandhiram

Updated On : June 16, 2021 / 7:35 PM IST

Jagame Thandhiram: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలి నటిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ధనుష్. ‘అసురన్’ లాంటి వైవిధ్యమైన కథతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ ధనుష్‌కి జోడిగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారు. ‘జగమే తందిరం’. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా మొత్తం 190 దేశాలలో నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళం, తెలుగు, మలయాళం. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ ఇలా మొత్తం 17 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా ఉండనుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి దాకా ధనుష్ నటించిన పాత్రల్లో ఇది కొత్తదనే చెప్పాలి. ఇలాంటి వైవిధ్యమైన కథతో ధనుష్ అభిమానులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.