Accident : కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు..8 మంది మృతి

జమ్మూమ్మూకశ్మీర్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీబస్సు లోయలో పడిపోవటంతో 8మంది ప్రాణాలు కోల్పోయారు.

Accident : కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు..8 మంది మృతి

Jammu And Kashmir Accident

Updated On : October 28, 2021 / 12:30 PM IST

Jammu and Kashmir Accident : జమ్మూమ్మూకశ్మీర్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారకముందే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గురువారం (అక్టోబర్ 28,2021) తెల్లవారుజామున ఓ మినీబస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన మినీబస్సు థాత్రి నుంచి దోడాకు ళ్తుండగా..సయిగార్వి సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Read more : Maha Accident : ఒకేసారి ఢీకొన్న ఎనిమిది వాహనాలు.. ముగ్గురు మృతి

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దోడా అదరపు ఎస్పీ వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించారు. వారితో పాటు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అతి కష్టంమీద సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇంకా సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెంటనే స్పందించారు. DC దోడా వికాస్ శర్మతో మంత్రి ప్రమాదం గురించి మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సనందించాలని ఆదేశించారు. ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more : Delhi : మ‌హిళా రైతుల మీదకు దూసుకొచ్చిన ట్ర‌క్కు..ముగ్గురు మృతి