Jeevitha – Rajasekhar : బి.ఏ. రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది : జీవిత – రాజశేఖర్..

బి.ఏ. రాజు ఆకస్మిక మరణం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజశేఖర్, జీవిత దంపతులు తెలియజేశారు. బి.ఏ. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..

Jeevitha – Rajasekhar : బి.ఏ. రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది : జీవిత – రాజశేఖర్..

Jeevitha Rajasekhar Condolences To B A Raju

Updated On : May 22, 2021 / 3:59 PM IST

Jeevitha – Rajasekhar: ప్రముఖ జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, అగ్ర పి.ఆర్.వో, నిర్మాత బి.ఏ. రాజు ఆకస్మిక మరణం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజశేఖర్, జీవిత దంపతులు తెలియజేశారు. బి.ఏ. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

B.A. Raju : ఫిలిం జర్నలిస్ట్ బి.ఏ. రాజు సినీ ప్రస్థానం..

రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ.. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల నుంచి మాకు బి.ఏ. రాజు గారితో పరిచయం ఉంది. ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి. మేం నటించిన చాలా చిత్రాలకు ఆయన పి.ఆర్.వో. గా చేశారు. మాకు పర్సనల్ పి.ఆర్.వో. గానూ పని చేశారు. కొన్నేళ్లు రాజశేఖర్ గారి డేట్లు చూశారు. తరచూ మేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మా కొత్త సినిమాలు వస్తే ఫోన్స్ చేసి మాట్లాడతారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మా పిల్లల సినిమాలపై కూడా అదే శ్రద్ధ చూపించారు. మాకు అండగా ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. బి.ఏ. రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది. ఎంతో బాధగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు రాజుగారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్లకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అన్నారు.