minister audio leak: కర్ణాటక మంత్రి ఆడియో లీక్.. చిక్కుల్లో ప్రభుత్వం

''ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం'' అని వ్యాఖ్యానించడం ఆ ఆడియోలో వినిపిస్తోంది. కో-ఆపరేషన్ మంత్రి ఎస్.టి.శోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా మునుస్వామి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఆడియో సంభాషణల ద్వారా తెలుస్తోంది. సమస్యలన్నీ తనకు తెలుసునని, మంత్రి సోమశేఖర్ దృష్టికి తాను తీసుకు వెళ్లినప్పటకీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనది, తాను చేసేది ఏముంటుందని మధుస్వామి ఆ ఫోన్ సంభాషణల్లో నిస్సహాయత వ్యక్తం చేశారు.

minister audio leak: కర్ణాటక మంత్రి ఆడియో లీక్.. చిక్కుల్లో ప్రభుత్వం

Karnataka minister says we are managing government not running it

Updated On : August 16, 2022 / 6:06 PM IST

Karnataka: తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని, కేవలం మ్యానేజ్ చేస్తున్నామంటూ కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు బొమ్మై ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. మంత్రి మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటికి వచ్చింది. అందులో ఈ వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి. రాజకీయంగా ఇది కర్ణాటకలో పెద్ద దుమారాన్ని లేపింది. అదును దొరికితే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది పదునైన ఆయుధంగా దొరికింది. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలను సీఎం బొమ్మై కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అది వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలని, వాటిని అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.

మధుస్వామి వ్యాఖ్యలపై విపక్షాల నుంచే కాకుండా అధికార పక్షం నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ సహచర మంత్రులే డిమాండ్ చేస్తుండడం విశేషం. హార్టీకల్చర్ మంత్రి మునిరత్న మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం చేసే వ్యక్తులు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదని, అలాంటి వారు రాజీనామా చేయొచ్చని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సాకుతో బీజేపీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై విరుచుకుపడుతోంది. బీజేపీ ప్రభుత్వం కేవలం ఆర్ఎస్ఎస్‭కు జవాబుదారీగా ఉందని, ప్రజల కోసం ఏమీ చేయదని తాము ఎప్పటి నుంచో చెప్తున్న మాటల్ని తాజాగా ప్రభుత్వంలోని వ్యక్తులే ఒప్పుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

చెన్నపట్నకు చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్‌కు మంత్రి మునుస్వామికి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు. రైతులకు సంబంధించిన అంశంపై కో-ఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసినప్పుడు మంత్రి సమాధానమిస్తూ ”ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం” అని వ్యాఖ్యానించడం ఆ ఆడియోలో వినిపిస్తోంది. కో-ఆపరేషన్ మంత్రి ఎస్.టి.శోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా మునుస్వామి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఆడియో సంభాషణల ద్వారా తెలుస్తోంది. సమస్యలన్నీ తనకు తెలుసునని, మంత్రి సోమశేఖర్ దృష్టికి తాను తీసుకు వెళ్లినప్పటకీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనది, తాను చేసేది ఏముంటుందని మధుస్వామి ఆ ఫోన్ సంభాషణల్లో నిస్సహాయత వ్యక్తం చేశారు.

Rajasthan: సచిన్ పైలట్ పేరెత్తకుండా తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం గెహ్లోత్