Jagga Reddy: అందుకే కేసీఆర్ దేశంలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీపై చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. లోక్‌సభలో టీఆర్ఎస్‌కు తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Jagga Reddy
Jagga Reddy: టీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీపై చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. లోక్‌సభలో టీఆర్ఎస్‌కు తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు. అటువంటి టీఆర్ఎస్.. 53 సీట్లు ఉన్న కాంగ్రెస్ చనిపోయిందని మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీని బలోపేతం చేసే పనిలోనే కేసీఆర్ ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లను కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కోల్పోతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం శక్తిని తీసుకురావడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
Warangal: భవనం ప్రహరీ గోడ కూలి ఇద్దరు కూలీల మృతి
భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశంలో పార్టీని ప్రారంభించి, తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన చెప్పారు. శరద్ పవార్, దేవెగౌడ కంటే కేసీఆర్ ఏమైనా గొప్ప లీడరా అని ఆయన నిలదీశారు. జాతీయ రాజకీయాల్లో తాడు బొంగరం లేని టీఆర్ఎస్ గురించి గొప్పలు చెప్పుకుంటూ కేసీఆర్ ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బలంగాలేని బీజేపీని కేసీఆర్ తన వ్యాఖ్యలతో బలపర్చుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉనికే లేదంటున్న కేసీఆర్‌తో భవిష్యత్తులో తాము పని చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.