రాకీ భాయ్ సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది..

రాకీ భాయ్ సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది..

Updated On : December 21, 2020 / 1:38 PM IST

KGF Chapter 2: రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న చిత్రం ‘కె.జి.యఫ్’ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

జనవరి 8 ఉదయం 10:18నిమిషాలకు రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మూవీ టీం తెలియజేశారు. ఆ రోజు టీజర్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ అధీరాగా కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల కానుంది ‘కె.జి.యఫ్’ 2.

KGF Chapter 2