KGF2: కేజీయఫ్2 8 రోజుల కలెక్షన్లు.. తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్!

కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన...

KGF2: కేజీయఫ్2 8 రోజుల కలెక్షన్లు.. తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్!

KGF2

Updated On : April 22, 2022 / 1:06 PM IST

KGF2: కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మాస్ వర్గాలను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో యశ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాను చూసేందుకు అక్కడివారే ఎక్కువ ఆసక్తిని చూపారంటే, ఈ సినిమా ఉత్తరాదిన ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు.

KGF2: బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ కుమ్ముడు.. మరో 8 రోజులు అడ్డేలేదు

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వారం రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించగా, ప్రశాంత్ నీల్ కోసం ఇప్పుడు ఇతర ఇండస్ట్రీ స్టార్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు.

KGF2: ‘కేజీయఫ్’కు కొత్త తలనొప్పి.. రంగంలోకి దిగిన రియల్ రాఖీ భాయ్ ఫ్యామిలీ!

అయితే కేజీయఫ్ చిత్రం 8 రోజులు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాలిడ్ వసూళ్లను రాబడుతూ.. ఇంకా స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. 8వ రోజున ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.750.35 కోట్లకు చేరుకుంది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 8 రోజుల వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.34.22 కోట్లు
సీడెడ్ – రూ.9.27 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.6.06 కోట్లు
ఈస్ట్ – రూ.4.51 కోట్లు
వెస్ట్ – రూ.2.79 కోట్లు
గుంటూరు – రూ.3.66 కోట్లు
కృష్ణా – రూ.3.30 కోట్లు
నెల్లూరు – రూ.2.20 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.66.01 కోట్లు(షేర్) (రూ.105.05 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.69.05 కోట్లు
తమిళనాడు – రూ.24.80కోట్లు
కేరళ – రూ.19.65 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా – రూ.134.75 కోట్లు
ఓవర్సీస్ – రూ.56.45 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.372.06 (షేర్) (రూ.750.35 కోట్లు గ్రాస్)