కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

Updated On : February 16, 2021 / 2:28 PM IST

Nagarjuna New Movie: కింగ్ నాగార్జున సూపర్ స్పీడ్ మీదున్నారు. ‘వైల్డ్ డాగ్’, బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన నాగ్ కొత్త సినిమా కోసం ప్రిపేర్ అయిపోయారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న కొత్త సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Nagarjuna New Movie

చిత్ర యూనిట్‌తో పాటు నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Image

 

ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌లో ప్రవీణ్ సత్తారు నాగ్‌ని సరికొత్తగా చూపించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని, రెగ్యులర్ షూటింగ్ కూడా కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేస్తామని మూవీ టీం తెలిపారు.

Nagarjuna New Movie