కలలో నిండినవాడే కనుల ముందర ఉంటే.. నూరేళ్లు నిదుర రాదులే..

Kolu Kolu Song: టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్).. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గురువారం ఈ సినిమాలోని ‘కోలుకోలమ్మా’ అనే లిరికల్ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.. చంద్రబోస్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాయగా, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, దివ్య మాలికతో కలిసి పాడారు.. ‘కోలుకోలమ్మా కోలో నా సామీ.. మనసే మేలుకొని చూసే.. కలలో నిండినవాడే కనుల ముందర ఉంటే.. నూరేళ్లు నిదురరాదులే’.. అంటూ సాగే పాట మంచి ఫీలింగ్‌తో ఆకట్టుకుంటోంది.
ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.