Korameenu : సరికొత్త సినిమా కొరమీను.. 1 మిలియన్ వ్యూస్ దాటిన టీజర్..
కొన్ని రోజుల క్రితం 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ ఓ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేశారు. దీంతో ఇదేం సినిమా అని ముందు నుంచి ఆసక్తి ఎక్కువయింది ప్రేక్షకుల్లో....................

Korameenu teaser crossed 1 million views in YouTube
Korameenu : కొన్ని రోజుల క్రితం ‘మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?’ అంటూ ఓ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేశారు. దీంతో ఇదేం సినిమా అని ముందు నుంచి ఆసక్తి ఎక్కువయింది ప్రేక్షకుల్లో. ఇటీవల ఈ సినిమా టైటిల్ ‘కొరమీను’ అని ప్రకటించి టీజర్ రిలీజ్ చేశారు.
ఆనంద్ రవి హీరోగా, కిశోర దాటరాక్ హీరోయిన్ గా, శ్రీపతి కర్రీ దర్శకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ‘కొరమీను’ సినిమాని నిర్మిస్తున్నారు. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది టైటిల్ కాప్షన్. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సినిమా ఒక జాలరి పేటలో జరిగే స్టోరీలా తెలుస్తుంది. మీసాల రాజు అనే పోలీసాఫీసర్ జాలరి పేటకి వెళ్తే ఎవరో మీసాలు తీసేస్తారు. దీంతో ఆ మీసాలు ఎవరు తీశారు అనే దానిపై కథ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అంతర్లీనంగా ఇంకో కథ కూడా ఉన్నట్టు, యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో మీసాల రాజుగా శత్రు నటిస్తున్నాడు. ఆనంద్ రవి, ఉత్తమన్, రాజా రవీంద్ర, గిరిధర్, ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు.. పలువురు నటించారు. ఇటీవల రిలీజయిన ఈ టీజర్ కి మంచి స్పందన లభించింది. టీజర్ కొత్తగా ఉండటంతో, ముందు నుంచి చిత్ర యూనిట్ సినిమాని వెరైటీగా ప్రచారం చేయడంతో ఈ టీజర్ వైరల్ అయింది. తాజాగా కొరమీను టీజర్ యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకొని మరింత దూసుకుపోతుంది.