మేముసైతం.. క్యానర్స్ బాధితులకు బాలయ్య యువసేన విరాళం..

  • Published By: sekhar ,Published On : July 2, 2020 / 04:49 PM IST
మేముసైతం.. క్యానర్స్ బాధితులకు బాలయ్య యువసేన విరాళం..

Updated On : July 2, 2020 / 5:32 PM IST

తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజు హంగామా చేసే అభిమానులు చాలామందే ఉంటారు. అయితే తమ అభిమాన కథానాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. మేం ఆయనకు అభిమానులం మాత్రమే కాదు.. భక్తులం కూడా.. అంటారు బాలయ్య అభిమానులు. అంతర్జాతీయ వైద్య దినోవత్సవం సందర్భంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన బాలయ్య యువసేన ప్రతినిధులు తమ వంతు సాయమందించారు.

Balayya Yuvasena

Basavatarakam Indo American Cancer Hospital & Research Instituteకు వారు విరాళం అందించారు. రూ.1,18,611ల చెక్కును ఆసుపత్రి సీఈవో డాక్టర్ ఆర్.వి.ప్రభాకర్‌కు బాలయ్య యువసేన ప్రతినిధులు పవన్ మర్ని, పొట్లూరి రాజేష్ అందచేశారు. బాలయ్య అభిమానులు కేవలం సినిమా పరంగానే కాకుండా సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటారని, బాలయ్య యువసేన వారు అందించిన ప్రతి రూపాయి పేద క్యాన్సర్ బాధితులకు ఖర్చు చేస్తామని ప్రభాకర్ తెలిపారు. బాలయ్య అభిమానులు చేసిన ఈ మంచి పనికి పలువురు వారిని అభినందించారు.

Read:‘భానుమతి రామకృష్ణ’ పేరు మార్చక తప్పదా?