‘క్రాక్’ మార్నింగ్ షోలు క్యాన్సిల్.. పైసలు వాపస్..

Krack Shows Cancelled: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది..
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఫస్ట్ తెలుగు మూవీ ‘క్రాక్’ కావడంతో సినీ ప్రేమికులు ఫస్ట్ డే చూడాలనుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా ఎర్లీమార్నింగ్ షో లతో పాటు మార్నింగ్ షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఆర్థిక లావా దేవిల వల్ల థియేటర్స్‌లో సినిమా పడలేదు. ప్రొడ్యూసర్‌కి చెన్నై ఫైనాన్షియర్‌కి మధ్య ఫైనాన్షియల్ వివాదం తలెత్తింది. ప్రస్తుతం ఈ వివాదం చెన్నై కోర్టులో ఉంది.
ఈ లావాదేవీల నడుమ ఉదయం షో లు క్యాన్సిల్ అయ్యాయి. 11గంటల నూన్ షో బదులు 12గంటల నుంచి షోలు పడతాయి అంటున్నారు నిర్మాత సన్నిహితులు
ఈ నేపథ్యంలో థియేటర్ సిబ్బంది టికెట్ల డబ్బులు వాపస్ ఇస్తున్నారు. ఎంతో ఆశగా సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లిన ఫ్యాన్స్, ఆడియెన్స్
ట్విట్టర్ వేదికగా నిరాశ తెలుపుతున్నారు.