Macharla Niyojakavargam : ఎట్టకేలకి ఆ ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి.. 4 నెలల తర్వాత..

నితిన్ హీరోగా, కృతిశెట్టి, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా మాచర్ల నియోజకవర్గం. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా...................

Macharla Niyojakavargam : ఎట్టకేలకి ఆ ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి.. 4 నెలల తర్వాత..

macharla niyojakavargam movie ready to release in ott

Updated On : November 26, 2022 / 9:16 AM IST

Macharla Niyojakavargam :  నితిన్ హీరోగా, కృతిశెట్టి, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా మాచర్ల నియోజకవర్గం. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ ఉంది. కానీ ఆగస్టులో రిలీజయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సినిమాలో కొన్ని పాటలు బాగా సక్సెస్ అయినా సినిమా మాత్రం పరాజయం పాలైంది.

సినిమా రిలీజయి ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు ఏ ఓటీటీలోకి మాచర్ల నియోజకవర్గం సినిమా రాలేదు. ఇటీవల హిట్ అయిన సినిమాలు కూడా 50 రోజులకి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అదే ఫ్లాప్ సినిమాలు అయితే వారం రోజులకే ఓటీటీలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మాచర్ల నియోజకవర్గం సినిమా ఇన్ని రోజులు అవుతున్నా ఓటీటీ అప్డేట్ ఇవ్వలేదు.

The Family Man : ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3 త్వరలో.. సమంతకి ఛాన్స్ ఇస్తారా??

తాజాగా ఈ సినిమాని డిసెంబర్ 9 నుంచి జీ5 లో రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జీ5 కూడా ఈ సినిమాని డిసెంబర్ 9న తమ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు పోస్ట్ చేసింది. అయినా ఒక ఫ్లాప్ సినిమాని ఓటీటీలోకి రాకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆపారో అర్ధం కావట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.