ఆగస్టు 19 నుండి థియేటర్లలో ‘మహా సముద్రం’

ఆగస్టు 19 నుండి థియేటర్లలో ‘మహా సముద్రం’

Updated On : January 30, 2021 / 1:58 PM IST

Maha Samudram Movie: సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ‘ఆర్ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం.. ‘మహా సముద్రం’.. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలు..

ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్ల క్యారెక్టర్లు హీరోలకు సమానంగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది. శనివారం ‘మహా సముద్రం’ విడుదల తేదీ ఖరారు చేశారు. ఆగస్టు 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Maha Samudram

లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇద్దరు యువ హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.