Mahesh Babu: మహేష్‌ను వెంటాడుతున్న మే సెంటిమెంట్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది....

Mahesh Babu: మహేష్‌ను వెంటాడుతున్న మే సెంటిమెంట్..?

Mahesh Babu Fans Worried Of May Sentiment

Updated On : March 24, 2022 / 5:54 PM IST

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ సినిమాను మే సెంటిమెంట్ వెంటాడుతుందా అంటే అవుననే అంటున్నారు అభిమానులు.

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

మహేష్ నటించిన సినిమాలను చూస్తే మే నెల ఆయనకు ఎలాంటి ఫెయిల్యూర్స్‌ను మిగిల్చిందో మనకు తెలుస్తోంది. 2016 మే 20న మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ డిజాస్టర్ బ్రహ్మోత్సవం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా మహేష్‌ను తీవ్ర డిప్రెషన్‌లోకి నెట్టేసింది.

ఇదొకటే కాదు.. 2003 మే 23న ‘నిజం’ అనే సినిమా కూడా మహేష్ కెరీర్‌లో భారీ ఫ్లాప్‌గా మిగిలింది. 2004 మే 14న ‘నాని’ చిత్రం కూడా మహేష్‌కు ఓ పీడకలను మిగిల్చింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే ఇలా మే నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు మహేష్‌కు డిజాస్టర్‌లను మిగిలిస్తున్న సెంటిమెంట్‌ను మహర్షి చిత్రం బ్రేక్ చేసింది.

Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!

2019 మే 9న మహర్షి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అదిరిపోయే విజయాన్ని అందుకోవడమే కాకుండా, 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇలా మే సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహర్షి చిత్రం ఇచ్చిన కాన్ఫిడెంట్‌తోనే ఇప్పుడు మహేష్ తన సర్కారు వారి పాట చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా మే సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మే 12న ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.