Mahesh Babu : కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించిన మహేష్ బాబు..
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు..

Mahesh Babu Sponsored Vaccination For Burripalem People On The Occassion Of His Father Krishna Birthday
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని తనవంతు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కేవలం బుర్రిపాలెం వాసులకే కాదు, మహేష్ తనవంతు సామాజిక కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి 1000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ సంస్థతో కలిసి ఆర్థిక అండదండలు లేక, వైద్య ఖర్చులను భరించలేని ఎంతో మంది చిన్నారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
Super Star Krishna : సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్..
నేడు (మే 31) తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు. వరుసగా ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అతను ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా ‘శ్రీమంతుడి’గా నిరూపించుకుంటున్నారు.
తన తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. దీంతో నిజ జీవితంలోనూ సూపర్ హీరోగా మహేష్ పేరు మార్మోగుతోంది..
Superstar @urstrulyMahesh Sponsored Vaccination for Burripalem people on the occassion of his father Superstar Krishna garu birthday in association with Andhra hospitals.#MBFoundation #MaheshBabu #SSMB#HBDLegendarySSKgaru#HBDSuperstarKrishnaGaru pic.twitter.com/LV2EGkiFKm
— BARaju’s Team (@baraju_SuperHit) May 31, 2021