Flight Turbulence: కుదుపునకు గురైన విమానం.. 11 మందికి గాయాలు

ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం భారీ కుదుపునకు గురైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Flight Turbulence: కుదుపునకు గురైన విమానం.. 11 మందికి గాయాలు

Flight Turbulence

Updated On : May 2, 2022 / 4:37 PM IST

Flight Turbulence: ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం భారీ కుదుపునకు గురైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా భారీ తుపాను కారణంగా ఒక్క సారిగా కుదుపునకు గురైంది. దీని ప్రభావంతో విమానం క్యాబిన్‌లో ఉన్న లగేజ్ కొంతమంది ప్రయాణికులపై పడిపోయింది. దీంతో కొందరికి గాయాలయ్యాయి.

Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షం: 2 గంటలు ఆలస్యంగా విమానం

ప్రయాణికులు కూడా ముందుకు, వెనుకకు వాలిపోయారు. దీనివల్ల కూడా మరింతమంది గాయపడ్డారు. ప్రయాణికులకు చెందిన వస్తువులు విమానంలో కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. మొత్తంగా ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ, పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని కొందరు ప్రయాణికులు వీడియో తీశారు.