మలైకా ముసలిది అయిపోయిందంటూ ట్రోలింగ్..

మలైకా ముసలిది అయిపోయిందంటూ ట్రోలింగ్..

Malaika Arora (image : Instagram)

Updated On : January 26, 2021 / 5:32 PM IST

Malaika Arora: మలైకా అరోరాకు ముసలితనం వచ్చేసింది.. మలైకా ముసలిది అయిపోయింది అంటూ నెటిజన్స్ ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. 40 ప్లస్ లోనూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్నట్లు ఉంటుంది మలైకా.

తాజాగా ఆమె జిమ్ నుండి బయటకు వస్తుండగా అక్కడున్న వారు పిక్స్ తీశారు. అయితే వాటిలో మలైకా పొట్ట మీద చారలు ఉన్నాయి.. దీంతో ఆమె ముసలిది అయిపోయింది అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

Malaika Arora

 

డెలివరీ తర్వాత మహిళలకు పొట్టమీద చారలు ఏర్పడడం అనేది సాధారణమే అయినా మలైకా సెలబ్రిటీ కావడంతోనే ఇలా ట్రోల్ చేస్తున్నారు. కాగా మహిళలకు ప్రసవానంతరం పొట్ట మీద మచ్చలు ఏర్పడడం సహజమని దానికెందుకు మలైకాను ట్రోల్ చేస్తున్నారు అంటూ కొంతమంది మలైకాకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Malaika Arora