‘మనసుకి హానికరం అమ్మాయే’..

‘మనసుకి హానికరం అమ్మాయే.. తెలిసినా తప్పుకోడు అబ్బాయే.. వదలలేవ్ ఉండలేవ్, కదలలేవ్ ఆగలేవ్’.. అంటూ అమ్మాయిల జోలికి పోకండి అని కుర్రాళ్లకి జాగ్రత్తలు చెబుతున్నారు యంగ్ హీరో శ్రీ సింహా.

‘మనసుకి హానికరం అమ్మాయే’..

Updated On : March 10, 2021 / 4:04 PM IST

Manasuki Hanikaram Ammaye: ‘మనసుకి హానికరం అమ్మాయే.. తెలిసినా తప్పుకోడు అబ్బాయే.. వదలలేవ్ ఉండలేవ్, కదలలేవ్ ఆగలేవ్’.. అంటూ అమ్మాయిల జోలికి పోకండి అని కుర్రాళ్లకి జాగ్రత్తలు చెబుతున్నారు యంగ్ హీరో శ్రీ సింహా.

‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’..

ఫస్ట్ మూవీ ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’.. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిషా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇప్పటివరకు వదిలిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. బుధవారం ‘మనసుకి హానికరం అమ్మాయే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. కాల భైరవ ట్యూన్ కంపోజ్ యెయ్యడంతో పాటు అచ్చు, పృథ్వి చంద్రలతో కలిసి పాడారు. కృష్ణ వల్లెపు లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.