MAA Elections: రేపు అజెండా ప్రకటించనున్న మంచు విష్ణు ప్యానెల్

రేపు మీడియా ముందుకు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు రానున్నారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు తన అజెండా ప్రకటించనున్నారు మంచు విష్ణు.

MAA Elections: రేపు అజెండా ప్రకటించనున్న మంచు విష్ణు ప్యానెల్

Maa Elections Manchu Vishnu

Updated On : September 23, 2021 / 11:48 AM IST

MAA Elections – Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉత్కంఠ పీక్ స్టేజ్ కు చేరింది. ప్రకాశ్ రాజ్ కు పోటీగా… తన ప్యానెల్ ను మంచు విష్ణు ప్రకటించాడు. మా ఎన్నికలలో తన ప్యానెల్ ను అధికారికంగా ఖరారు చేస్తూ.. ట్విట్టర్ లో ప్రకటన చేశారు.

గెలుపు గుర్రాలను రంగంలోకి దించానంటున్నారు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు దీటుగా ఉండే అభ్యర్థులనే రంగంలోకి దించినట్టు మంచు విష్ణు వర్గం చెబుతోంది. రేపు మీడియా ముందుకు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు రానున్నారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు తన అజెండా ప్రకటించనున్నారు మంచు విష్ణు. మా కోసం మనమందరం పేరుతో మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారాయన.

మంచు విష్ణు ప్యానెల్ ఇదే..!

అధ్యక్షుడు -మంచు విష్ణు

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ -బాబు మోహన్

ఉపాధ్యక్షులు- మాదాల రవి, పృథ్వీరాజ్,

జనరల్ సెక్రటరీ- రఘుబాబు

జాయింట్ సెక్రటరీలు – కరాటే కళ్యాణి, గౌతమ్ రాజ్

ట్రెజరర్ – శివబాలాజీ,

ఈసీ సభ్యులుః అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, పూజిత, రాజేశ్వరిరెడ్డి, రేఖ, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు బోపన్న, వడ్లపట్ల MRC.