Manmadh Rebba : అమెరికా లో మెరిసిన తెలుగు తేజం ‘మన్మధ్ రెబ్బా’.. 386 కిలోమీటర్లు పరిగెత్తి..

బ్యాడ్ వాటర్ అల్ట్రామారాథాన్ రేస్ లో ఎంపికయిన భారతీయుడు 'మన్మధ్ రెబ్బా' మన తెలుగువాడు కావడం విశేషం. ఈ రేసులో..

Manmadh Rebba : అమెరికా లో మెరిసిన తెలుగు తేజం ‘మన్మధ్ రెబ్బా’.. 386 కిలోమీటర్లు పరిగెత్తి..

Manmadh Rebba First Ultraman from South India in Badwater 135

Manmadh Rebba : “మన్మధ్ రెబ్బా” అన్ని అడ్డంకులను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఫుట్ రేస్ ‘బ్యాడ్ వాటర్ అల్ట్రామారాథాన్’ను పూర్తి చేశారు . ఇది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలోని బాడ్ వాటర్ బేసిన్ లో సముద్ర మట్టానికి 282 అడుగుల దిగువన ప్రారంభమై విట్నీ పోర్టల్ వద్ద సముద్ర మట్టానికి 8360 అడుగులు (2550 మీటర్లు) ఎత్తులో ముగుస్తుంది. 50+ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు తరచుగా చేరుకుంటున్న విపరీతమైన పరిస్థితుల్లో ఇటీవల మన్మధ్ రెబ్బా తన రేసును పూర్తి చేశారు.

మన్మధ్ రెబ్బా బ్యాడ్ వాటర్ అల్ట్రామారాథాన్ రేస్ లో ఎంపికయిన భారతీయుడు, మన తెలుగువాడు కావడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన ఈయన మన హైదరాబాదీనే. JNTU University, హైదరాబాద్లో ఆర్కిటెక్చర్ చేశారు, తన తండ్రి హనుమయ్య రెబ్బా సిండికేట్ బ్యాంక్, బంజారాహిల్స్ బ్రాంచ్ లో పనిచేసేవారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్, రేసింగ్ తర్వాత ఈ కఠినమైన రేసుకు అర్హత సాధించారు మన్మథ . 2017, 2018, 2019 సంవత్సరాల్లో అల్ట్రామాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ హవాయి (320 మైళ్లు – 515 కిలోమీటర్లు) రేసులో వరుసగా 3 సార్లు ఎంపికయి , పాలగున్న ఏకైక భారతీయుడు మన్మధ్ రెబ్బా.

Alia Bhatt : ఇంగ్లీష్ న‌టికి తెలుగు నేర్పిస్తున్న హిందీ న‌టి.. మీకు నా ముద్దులు.. వీడియో వైర‌ల్‌

ఇటీవల, మోయాబ్ 240 రేసులో ఎంపికయి, పాలగున్న ఏకైక భారతీయుడు మన్మధ్ రెబ్బా. ఎడారి, లోయలు, మృదువైన రాతి మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో కఠినమైన మరియు అందమైన భూభాగం గుండా 386 కిలోమీటర్లు పరిగెత్తారు .

‘నా తోటి అథ్లెట్లలో ఒకరు దీనికి అర్హత సాధించినప్పుడు,చాలా ఆసక్తిగా అనిపించింది, 50+సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 217 కిలోమీటర్లు పరిగెత్తడం అసాధ్యం అనిపించింది మరియు ఎంపికైన కొద్ది మంది ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారో అని చాలా ఆసక్తి చెందాను. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వారితో పోలిస్తే చాలా తక్కువ మంది అథ్లెట్లు మాత్రమే ఈ రేసును పూర్తి చేశారు” అని మన్మధ్ రెబ్బా చెప్పారు.

Rocky Aur Rani Kii Prem Kahaani : బాలీవుడ్‌లో మరో 100 కోట్ల సినిమా.. హిందీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయా..?

“ఈ రేస్ మానవ ప్రయాణానికి అద్దం లాంటిది, ముఖ్యంగా యుఎస్ లో పనిచేస్తున్నప్పుడు నా జీవిత ప్రయాణానికి అన్వయించదగినది, కఠినమైన పరిస్థితులతో పోరాడాలి, కెరీర్ మరియు జీవితంలో అట్టడుగు స్థాయి నుండి కోరుకున్న స్థాయికి ప్రయాణించాలి, వివిధ రకాల సవాళ్లతో నిండి ఉంటుంది ఈ ప్రయాణం. ఈ రేస్ బాగా ఖర్చుతో కూడుకున్నది. నా శిక్షణ, నా డైట్ మరియు నా క్రూ సపోర్ట్ స్వతంగా చూసుకుంటున్నాను. దానికి కావాల్సిన డబ్బు నా సేవింగ్స్ నుండి ఉపయోగిస్తున్నాను” అని మన్మధ్ రెబ్బా అన్నారు.

‘బ్యాడ్ వాటర్ అల్ట్రామరాథాన్’ కోసం నా క్రూ చీఫ్ బోజన్ మారిక్, సెర్బియా నుండి 2+ రోజులు ప్రయాణించాడు. టెక్సాస్ లోని హ్యూస్టన్ కు చెందిన హాన్స్ సిమెలింక్, శాన్ డియాగోకు చెందిన కానర్ మెక్ క్లెల్లాండ్, బ్రెండన్ మార్టిస్ నా రేస్ కి వెన్నెముకగా నిలిచారు. రేసు సమయంలో నా అవసరాలకు మద్దతు ఇచ్చారు. బ్యాడ్ వాటర్ 135 కోసం, వేడి మరియు దూరంపై నేను శిక్షణ పొందాను, ప్రోటోకాల్స్ పైన వారానికి 80-140 కిలోమీటర్లు పరిగెత్తుతాను. ఆరోగ్యకరమైన ఆహారం, తరచు స్వీయగా వంట చేసుకునేవాడిని ‘ అని మన్మధ్ రెబ్బా తెలిపారు.