మోడెర్నా వ్యాక్సిన్ 100% ప్రభావవంతం..

  • Published By: sreehari ,Published On : December 2, 2020 / 09:20 AM IST
మోడెర్నా వ్యాక్సిన్ 100% ప్రభావవంతం..

అమెరికా బయోటెక్ సంస్థ మోడెర్నా వ్యాక్సిన్ 100 శాతం ప్రభావంతమని ట్రయల్ ఫలితాల్లో నివేదించింది. కొన్నివారాల క్రితమే మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. కోవిడ్-19 మూడో దశ ట్రయల్ తుది ఫలితాలను వెల్లడించింది. మధ్యంతర ఫలితాల్లో టీకా మొత్తం సామర్థ్యం 94.1 శాతంగా నిర్ధారణ కాగా.. తుది ఫలితాల్లో స్వల్ప మార్పుతో 100 శాతం కోవిడ్ -19ను సమర్థవంతగా నివారించగలదని పేర్కొంది.మూడో దశ ట్రయల్స్‌లో 30,000 మంది అమెరికన్ వాలంటీర్లు పాల్గొన్నారు. వారిలో సగం మందికి నాలుగు వారాల వ్యవధిలో రెండు మోతాదుల వ్యాక్సిన్ అందించారు. మిగిలిన సగం మందికి ప్లేసిబో ఇచ్చారు. ట్రయల్స్ సమయంలో 196 మందిలో కోవిడ్-19కు ప్రభావితమయ్యారు. వారిలో 185 మంది ప్లేసిబో గ్రూపులో 11 మంది టీకా గ్రూపులో ఉన్నారు. ప్లేసిబో గ్రూపులో ముప్పై కేసులు తీవ్రమైన కోవిడ్ -19 లక్షణాలతో బాధపడుతున్నారు. టీకా గ్రూపులో మాత్రం తీవ్రమైన లక్షణాలతో కూడిన కరోనా కేసులు లేవు.


తద్వారా మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. 94.1శాతం సామర్థ్యంతో కోవిడ్ -19 వ్యాధిని నివారించగలదని రుజువు చేశారు. తీవ్రమైన కోవిడ్ -19 వ్యాధిని నివారించగల సామర్థ్యం తమ టీకాకు ఉందన్నారు. ఈ మహమ్మారి గతిని మార్చగల సామర్థ్యం తమ వ్యాక్సిన్ కు ఉందన్నారు. ఆసుపత్రిలో మరణాలను నివారించడంలో కొత్త శక్తివంతమైన సాధనాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మోడెర్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెఫాన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డేటాను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA), US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదానికి సమర్పించింది. డిసెంబర్ 17న జరగబోయే సమావేశంలో ఎఫ్‌డిఎ నుంచి కంపెనీ సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తోంది.
https://10tv.in/no-need-corona-virus-vaccine-entire-nation-people/
తాత్కాలిక డేటా ప్రకారం.. టీకా గణనీయమైన సైడ్ ఎఫెక్టులు లేకుండా తట్టుకోగల సామర్థ్యం ఉంది. సాధారణ ప్రభావాల్లో అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, అలాగే ఇంజెక్షన్
వేసిన చోట నొప్పి ఎర్రపారడం వంటి స్వల్పకాలిక లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ వ్యాక్సిన్‌ వేసినప్పుడు కనిపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయి. వైరస్ జన్యు సంకేతం, mRNA, చిన్న భాగాన్ని మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా టీకా పనిచేస్తుంది. వైరస్ నిర్దిష్ట ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీర కణాలు ఉపయోగిస్తాయి. ఈ ప్రోటీన్ రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధక శక్తి అలర్ట్ అవుతుంది వైరస్‌తో పోరాడుతుంది.రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో ప్రస్తుతం అనిశ్చితంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాక్సిన్ స్టోరేజీ కోసం.. మోడెర్నా వ్యాక్సిన్ -20 ° C / -4 ° F లోతైన ఫ్రీజర్ ఉష్ణోగ్రత వద్ద ఉంచాల్సిన అవసరం ఉంది, 6 నెలల వరకు సాధారణ ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. ఈ నెలాఖరు నాటికి, యుఎస్‌లో సుమారు 20 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ లభిస్తుందని మోడ్రానా అంచనా వేస్తోంది. 2021లో, ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ నుంచి 1 బిలియన్ మోతాదుల మధ్య తయారీ చేసిరవాణా చేయాలని కంపెనీ ఆశిస్తోంది.