Singer Rahul Jain : ప్రముఖ సింగర్ పై అత్యాచారం కేసు.. ఆమె ఎవరో కూడా తెలీదంటున్న సింగర్..

 ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, కంపోజర్‌ రాహుల్‌ జైన్‌పై ఆత్యాచారం కేసు నమోదైంది. ఓ 30 ఏళ్ల కాస్ట్యూమ్‌ స్టైలిస్ట్‌ ముంబై పోలీసులను ఈ విషయంలో ఆశ్రయించగా ఆ మహిళ ఆరోపణలతో పోలీసులు రాహుల్‌పై...............

Singer Rahul Jain : ప్రముఖ సింగర్ పై అత్యాచారం కేసు.. ఆమె ఎవరో కూడా తెలీదంటున్న సింగర్..

molestation case filed on bollywood singer rahul jain

Updated On : August 16, 2022 / 12:56 PM IST

Singer Rahul Jain : ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, కంపోజర్‌ రాహుల్‌ జైన్‌పై ఆత్యాచారం కేసు నమోదైంది. ఓ 30 ఏళ్ల కాస్ట్యూమ్‌ స్టైలిస్ట్‌ ముంబై పోలీసులను ఈ విషయంలో ఆశ్రయించగా ఆ మహిళ ఆరోపణలతో పోలీసులు రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌ లో.. ”రాహుల్‌ తన పనితనాన్ని మెచ్చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్‌ చేశాడు, నన్ను తన పర్సనల్‌ స్టైలిస్ట్‌గా కూడా నియమించుకుంటానని చెప్పి ఒకసారి కలవమన్నాడు. అతన్ని కలవడానికి అతడి ఫ్లాట్‌కి వెళ్ళాను. అప్పుడే నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను ప్రతిఘటించినా బలవంతంగా అత్యాచారం చేశాడు. నా ఫోన్ లాక్కొని తన ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌, ఫోన్‌కాల్‌కు సంబంధించిన సాక్ష్యాలను అన్ని డిలీట్ చేశాడు” అని తెలిపింది ఆ మహిళా.

Nayan-Vignesh : స్పెయిన్ లో సెకండ్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయన్ విగ్నేష్

పోలీసులు కేసు నమోదు చేసుకొని రాహుల్ జైన్ పై సెక్షన్ 376, 323 కింద రాహుల్‌ జైన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇది మీడియా ద్వారా బయటకి రావడంతో సింగర్‌ రాహుల్‌ దీన్నిఖండిస్తూ అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలీదు, ఇంతకుముందెప్పుడూ చూడలేదు అని అన్నాడు. ఈ ఘటనతో రాహుల్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.