ప్రపంచమంతా కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించలేదు.. వీడిన మిస్టరీ

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 04:52 AM IST
ప్రపంచమంతా కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించలేదు.. వీడిన మిస్టరీ

Updated On : October 31, 2020 / 2:57 PM IST

మిలీనియం క్రితం సీక్రెట్‌ను సైంటిస్టులు బయటపెట్టారు. 1110వ సంవత్సరంలో చంద్రుడు కొద్ది నెలలుగా కనిపించకుండాపోయిందట. నెలల తరబడి చీకటిలో ఉండిపోయిన భూ గ్రహంపై జరిగిన వాస్తవాన్ని బయటపెట్టారు సైంటిస్టులు. 900ఏళ్ల క్రితం చంద్రుడు కనిపించకుండా పోవడంపై వాస్తవం ఏంటో తెలుసుకుందాం..

స్విట్జర్లాండ్ లోని జెనీవా యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించిన రీసెంట్ రీసెర్చ్ లో సమాధానమిదే. వోల్కనిక్ యాష్, సల్ఫర్, చలి వాతావరణం అంతా కలిసి చంద్రుడు అదృశ్యమవడానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు. క్లైమాటిక్ అండ్ సోసైటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఏ ఫర్‌గటెన్ క్లస్టర్ ఆఫ్ వొల్కనిక్ ఎరప్షన్స్ ఇన్ 1108-1110 సీఈ’ (వాతావరణ, సామాజిక పరిస్థితుల ప్రభావం 1108-1110లో మరుగున పడిన వాస్తవం) అనే టైటిల్ తో పరిశోధన జరిపారు. 

NEEM-2011-S1, NGRIP, WDC06A డేటా ఆధారంగా రీసెర్చ్ జరిపారు. ‘1108 సంవత్సరం మధ్యలో జరిగిన వాతావరణ పరిస్థితుల’ గురించి చెబుతుంది. భూవాతావరణంలో సల్ఫర్ గాఢత కనిపించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. 1110 సంవత్సరం చివరి వరకూ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. 1108-1110 మధ్య కాలంలో అగ్ని పర్వతాలు లేదా అంతరిక్షంలో ఉండే గ్రహ శకలాలు బద్ధలు కావడంతో అలాంటి వాతావరణం ఏర్పడి ఉండొచ్చు. 

స్ట్రాటో‌స్పియర్ వాతావరణంలో జరిగిన మార్పులు భారీ పరిమాణంలో ఏర్పడిన అగ్నిపర్వతాల పేలుడు చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణాలు అయి ఉండొచ్చు. అందిన వివరాల ప్రకారం.. పరిశీలిస్తే ఘటనకు కారణాలు తెలుస్తున్నాయి కానీ, మూలాలు అర్థం చేసుకోలేకపోతున్నారు సైంటిస్టులు. 

Also Read : Facebook, Google ఉద్యోగులకు సంవత్సరం చివరి వరకూ Work from Home