పది లక్షల మందికిపైగా చిన్నారులకు కరోనా.. 18ఏళ్లలోపే ఎక్కువంట!

  • Published By: sreehari ,Published On : November 17, 2020 / 08:21 AM IST
పది లక్షల మందికిపైగా చిన్నారులకు కరోనా.. 18ఏళ్లలోపే ఎక్కువంట!

Updated On : November 17, 2020 / 10:57 AM IST

More than 1 million US children diagnosed with Covid-19 : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. పెద్దలపైనే కాదు.. చిన్నారులపైనా కరోనా పంజా విసురుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్నిరకాల వయస్సులవారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

అమెరికాలో 1 మిలియన్ పైనా (పది లక్షల మంది)కిపైగా కరోనా బారినపడ్డారని పెడియాట్రిషియన్స్ వెల్లడించారు.



కరోనా బారినపడ్డవారిలో 18ఏళ్లలోపు వారే ఎక్కువ మంది ఉన్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్ హాస్పటిల్ అసోసియేషన్ పేర్కొంది.

నవంబర్ 12 నాటికి అమెరికాలో మొత్తం 1,039,464 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు.



వారం వ్యవధిలో చిన్నారుల్లో 111,946 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని పలు కమ్యూనిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని అమెరికన్ అకాడమీ పెడియాట్రిక్స్ డాక్టర్ Sally Goza తెలిపారు.
https://10tv.in/moderna-says-its-vaccine-is-94-5-effective-in-preventing-covid-19/
మూడు దశాబ్దాలుగా తాను పెడియాట్రిక్ గా పనిచేస్తున్నానని, ఇన్ని ఏళ్లలో లక్షల సంఖ్యలో చిన్నారులు వైరస్ బారినపడటం చాలా విచారకరమన్నారు.



కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా వ్యూహాత్మక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆయన అన్నారు. ప్రజల్లో కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని గోజా తెలిపారు.



మహమ్మారి సమయంలో అత్యధిక సంఖ్యలో చిన్నారులు వైరస్ బారినపడుతున్నారని, వారితో పాటు కుటుంబాలు, కమ్యూనిటీలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్ లైన్ మెడికల్ బృందాలు కూడా వైరస్ మారినబడుతున్నారు. వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.