Nagpur cops : 15 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడి కేసుల్లో ఇరుక్కున్న పోలీసులు..

Nagpur cops : 15 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడి కేసుల్లో ఇరుక్కున్న పోలీసులు..

Nagpur Cops Pro

Updated On : April 21, 2021 / 5:09 PM IST

Nagpur cops rescue 15 critical Covid patients : ప్రాణాలు కాపాడితే కష్టాల్లో పడతారా? అంటే నిజమననేలా ఉంది నాగ్ పూర్ పోలీసుల పరిస్థితి. ఒకరూ ఇద్దరూ కాదు 15మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు నాగ్ పూర్ పోలీసులు. ఆతరువాత వారికి తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కున్నారు పాపం. అదేంటీ రోగుల ప్రాణాలు కాపాడితే ప్రశంసించాలి గానీ కేసులో పెట్టటమేంటీ అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు కరోనా పేషెంట్లకోసం తీసుకొచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు బెదిరించి తీసుకొచ్చారని ఉన్నతాధికారులు వారిపై కేసులు నమోదు చేసిన ఘటన నాగ్ పూర్ లో జరిగింది. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందన్నట్లుగా ఉంది పాపం నాగ్ పూర్ పోలీసుల పరిస్థితి.

వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో గత ఆదివారం (ఏప్రిల్ 18,2021) రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని..కానీ ఆస్పత్రిలో 15మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించాల్సి ఉందని దయచేసి ఎలాగైనా ఆక్సిజన్ అందేలా చేయమంటూ మొరపెట్టుకున్నారు.

పేషెంట్ల కోసం కనీసం 10 సిలిండర్లయినా కావాలని పోలీసులను కోరారు. దీంతో వెంటనే స్టేషన్ లో ఆ సమయంలో డ్యూటీ చేస్తున్న ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె.. తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలని వెంటనే ఇవ్వాలని కోరారు. కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలంటే పర్మిషన్ లెటర్ ఇవ్వాలని లేకుండా ఇవ్వలేమని ప్లాంట్ యజమాని తేల్చి చెప్పారు. కానీ ఆస్పత్రిలో రోగులు ప్రమాదంలో ఉన్నారని..వారికి ఆక్సిజన్ అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని పరిస్థితి అర్థం చేసుకుని సిలిండర్లు ఇవ్వాలని పోలీసులు మరోసారి అడిగారు ఎస్సై మహాదేవ్. దీంతో..పరిస్థితి అర్థం చేసుకున్న అతని ఏడు సిలిండర్లను అందించాడు.

ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు ఎస్సై మహాదేవ్ తన సిబ్బందితో సహా. దీంతో వెంటనే పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందితో సహా పోలీసులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంత వరకూ బాగానే ఉంది. సమయానికి స్పందించి అర్థరాత్రి ఆక్సిజన్ సిలిండర్లు అందించిన పోలీసులను ప్రశంసించాల్సింది పోయి ఉన్నతాధికారులు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చిన పోలీసులపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణమేమంటే..ఆక్సిజన్ ప్లాంట్ యజమానులను బెదిరించి సిలిండర్లను తీసుకొచ్చారనే ఆరోపణలతో ఆరోపణలతో ఎస్సై మహాదేవ్ తో సహా అతనితో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.