Naresh Agastya : ‘పంచతంత్రం’ లో విహారిగా నరేష్ అగస్త్య…

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’..

Naresh Agastya : ‘పంచతంత్రం’ లో విహారిగా నరేష్ అగస్త్య…

Naresh Agastya

Updated On : May 10, 2021 / 4:16 PM IST

Panchathantram: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’.. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విహారి పాత్రలో నరేష్ అగస్త్య నటిస్తున్నారని తెలిపారు.

Panchathantram : ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌ల ‘పంచతంత్రం’..

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ‘‘నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మూవీలో తను విహారి పాత్రలో కనిపిస్తాడు. హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన అబ్బాయి పాత్రలో నరేష్ అగస్త్య అద్భుతంగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చూపును తనవైపు తిప్పుకొన్న నరేష్ అగస్త్య, విహారి పాత్రలో తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు’’ అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ ‘‘విహారి… ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కార్పొరేట్ కంపెనీలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహరికి ఎదురయ్యే సమస్యలు, సందర్భాలు ఉంటాయి’’ అని చెప్పారు.

Samuthirakani : సముద్రఖని బర్త్‌డే స్పెషల్.. ‘పంచతంత్రం’లో రామనాథం ఫస్ట్‌లుక్ రిలీజ్..

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:

ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు
క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి
మాటలు: హర్ష పులిపాక – ‘కలర్‌ ఫొటో’ సందీప్‌ రాజ్‌
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు
రైటర్‌ –డైరెక్టర్‌: హర్ష పులిపాక..