Connect : ఇంటర్వెల్ లేకుండా నయనతార సినిమా..

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటర్వెల్ లేకుండా సినిమాని రిలీజ్ చేయబోతుంది. తాజాగా నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఆమె తర్వాతి సినిమా గురించి తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. నయనతార మెయిన్ లీడ్ లో.........

Connect : ఇంటర్వెల్ లేకుండా నయనతార సినిమా..

Nayanathara Connect movie coming soon without interval

Updated On : December 1, 2022 / 8:48 AM IST

Connect :  సినిమా నిడివి ఇప్పుడు దాదాపు 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు ఉంటున్నాయి. చాలా రేర్ గా 2 గంటల కంటే తక్కువ నిడివి ఉన్న సినిమాలు వస్తాయి. అలాంటి సినిమాలకి కూడా ఇంటర్వెల్ ఇస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటర్వెల్ లేకుండా సినిమాని రిలీజ్ చేయబోతుంది.

తాజాగా నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఆమె తర్వాతి సినిమా గురించి తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. నయనతార మెయిన్ లీడ్ లో అశ్విన్ శరవణ దర్శకత్వంలో విగ్నేష్ శివన్ నిర్మాతగా కనెక్ట్ అనే సినిమా తెరకెక్కుతుంది. హారర్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేసి.. ఈ సినిమా కేవలం 99 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. ఇంటర్వెల్ లేకుండా సినిమా ఉండబోతుంది. మీరు మంచి హారర్ అనుభవాన్ని పొందుతారు అని ట్వీట్ చేశాడు విగ్నేష్ శివన్.

Kerala : అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..

దీంతో హారర్ సినిమా కావడం, ఇంటర్వెల్ లేకుండా గంటన్నర సినిమా కావడంతో ప్రేక్షకులు, నయన్ అభిమానులు కనెక్ట్ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.