Neeraj Chopra 5 Fitness Secrets : నీరజ్‌చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటంటే…

జావెలిన్ త్రో గోల్డెన్ స్టార్, సుబేదార్ నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం రండి. లౌసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 87.66 మీటర్ల త్రోతో స్టైల్‌గా పుంజుకున్నాడు....

Neeraj Chopra 5 Fitness Secrets : నీరజ్‌చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటంటే…

Neeraj Chopra 5 Fitness Secrets

Neeraj Chopra 5 Fitness Secrets : జావెలిన్ త్రో గోల్డెన్ స్టార్, సుబేదార్ నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం రండి. లౌసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 87.66 మీటర్ల త్రోతో స్టైల్‌గా పుంజుకున్నాడు. గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత నీరజ్ తిరిగి వచ్చాడు. ఫౌల్ త్రోతో ప్రారంభించినప్పటికీ నీరజ్ వరుసగా రెండవ డైమండ్ లీగ్ మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఇతను ప్రపంచ అథ్లెటిక్స్ లో రెండవ స్థానంలో ఉన్నారు. చోప్రా(Neeraj Chopra Became Non-Vegetarian) భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.

Heavy Rainfall : ఢిల్లీ, ముంబయితోపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

నీరజ్ విజయం వెనుక అతను తీసుకుంటున్న ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనది. నీరజ్ ఉదయాన్నే రసం లేదా కొబ్బరినీళ్లతో ఆయన డైట్ ప్రారంభమవుతోంది. అల్పాహారంలో నాలుగు కోడిగుడ్లలోని తెల్లసొన, రెండు బ్రెడ్ ముక్కలు, ఒక గిన్నె డాలియా, పండ్లు తింటారు. మధ్యాహ్న భోజనంలో పప్పుతో అన్నం, పెరుగు, సలాడ్ తో గ్రిల్ చికెన్ ఉంటాయి.

Maharashtra Bus Catches Fire : మహారాష్ట్ర బస్సులో మంటలు..25మంది మృతి

రాత్రి భోజనంలో సూప్, ఉడికించిన కూరగాయలు, పండ్లు తినేందుకు ఇష్టపడతారు. నీరజ్ కు పండ్లు అంటే ఎంతో ఇష్టం. పండ్లతో పాటు కొవ్వు ఉన్న ఉత్పత్తులు, ప్రోటీన్ సంప్లిమెంట్లను తీసుకుంటారు. నీరజ్ 2016వ సంవత్సరం వరకు స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అయ్యారు. కానీ 2016వ సంవత్సరంలో శిక్షణ కోసం అమెరికాలో ఉన్నప్పుడు, అతను బరువు తగ్గడం ప్రారంభించడంతో పరిస్థితులు మారిపోయాయి.

Kenya Road Crash : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 48 మంది మృతి

నాన్ వెజ్ ఐటమ్స్ ను (Became Non-Vegetarian) డైట్ లో చేర్చుకోవడం ప్రారంభించాలని డైటీషీయన్లు కోరారు. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, ఆమ్లెట్ తినవచ్చని ఒలింపిక్ ఛాంపియన్ గతంలో కూడా చెప్పారు.నీరజ్‌కి కూడా సాల్మన్ ఫిష్ అంటే చాలా ఇష్టం. నీరజ్ తన డైట్‌లో ఇటీవల సాల్మన్ ఫిష్‌ని చేర్చుకున్నారు.