Neredukomma Srinivas : కరోనాతో కన్నుమూసిన సినీ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్..

ప్రముఖ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో తుది శ్వాస విడిచారు. అనేక సినిమా పాటలే కాకుండా కొన్ని దేశ భక్తి పాటలు పాడారు..

Neredukomma Srinivas : కరోనాతో కన్నుమూసిన సినీ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్..

Neredukomma Srinivas

Updated On : May 22, 2021 / 1:23 PM IST

Neredukomma Srinivas: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటోంది.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోవిడ్ కారణంగా కన్నుమూశారు. వారి మరణవార్తలను మర్చిపోకముందే సినీ పరిశ్రమకు చెందిన మరో వ్యక్తి కన్నుమూయడం బాధాకరం..

ప్రముఖ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో తుది శ్వాస విడిచారు. అనేక సినిమా పాటలే కాకుండా కొన్ని దేశ భక్తి పాటలు పాడారు..

తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన ‘జై’ సినిమాలో ‘‘దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జండా మనదే’’ అనే పాటతో ప్రాచుర్యం పొందిన నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జై శ్రీనివాస్ మరణవార్త విన్న సినీ పరిశ్రమ వారు సంతాపం తెలియజేస్తున్నారు..