Dharmavaram : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘ధర్మవరం’..
గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది.(Dharmavaram)

Dharmavaram
Dharmavaram : రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ధర్మవరం. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్.. పలువురు కీలక పాత్రల్లో న్తసితున్నారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది.(Dharmavaram)
ఇప్పటికే ధర్మవరం షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ధర్మవరం సినిమా ఫస్ట్ పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. అనంతరం ఆయన పోస్టర్ బాగుందని మూవీ యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు.
ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ.. ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్. ఈ సినిమాలో ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. వినాయక చవితి పండగ సమయంలో పోస్టర్ విడుదల కావడం మాకు శుభసూచకం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.