Bramhanda : ‘బ్రహ్మాండ’ మూవీ రివ్యూ.. డివోషనల్ థ్రిల్లర్..
ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్ కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్ గా మారి సినిమా కూడా చర్చగా మారింది.(Bramhanda)

Bramhanda
Bramhanda : ఆమని, కొమరం, బన్నీ రాజు, కనీకా వాధ్వ, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్.. పలువురు నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మాండ’. దాసరి సునీత సమర్పణలో డైరెక్టర్ రాంబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్రహ్మాండ సినిమా నేడు ఆగస్టు 29న థియేటర్స్ లో రిలీజయింది.(Bramhanda)
కథ విషయానికొస్తే.. ఇచ్చోళ గ్రామంలో అర్ధరాత్రి పూట హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆర్నెల్ల నుంచి వరుసగా హత్యలు జరిగి కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారే హత్యలు చేస్తుందని అందరూ భావిస్తారు. దీంతో సాయంత్రం 6 తర్వాత ఇంట్లోంచి ఎవరూ బయటకు రావొద్దని దండోరా వేయిస్తారు. అయినా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారుతుంది.
ఈ హత్యల నేపథ్యంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరను కూడా ఆపేయాలని పోలీసులు అనుకుంటారు. మరి ఆ జాతర ఆగిందా? అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు? అమ్మవారు హత్యలు చేస్తుంది అని ఎందుకు నమ్ముతున్నారు? మధ్యలో ఓ ప్రేమ జంట లవ్ స్టోరీ ఏంటి? పోలీసులు మర్డర్ మిస్టరీను చేధించారా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
ఇటీవల మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఆదరణ బాగానే ఉంది. దానికి డివోషనల్ టచ్ ఇస్తే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ తోనే ఈ బ్రహ్మాండ సినిమాని తెరేక్కించారు. ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్ కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్ గా మారి సినిమా కూడా చర్చగా మారింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా.
వరుసగా హత్యలు జరుగుతుంటాయి, అవి అమ్మవారి చేసారని అంతా భావిస్తారు. మరి ఆ హత్యలు ఎవరు చేసారు అని కనుక్కోవడం సస్పెన్స్ గా సాగుతుంది. అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీయడంతో ఇక్కడ ఒగ్గు కళాకారులను కూడా కథలో కలుపుతూ దైవం, ఇక్కడ సంసృతిని కూడా బాగా చూపించారు. అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అనే సస్పెన్స్ ని మాత్రం చివరి వరకు బాగా మెయింటైన్ చేసారు. లవ్ స్టోరీ కూడా పర్వాలేదనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సీనియర్ నటి ఆమనికి మంచి పాత్రే పడింది. జబర్దస్త్ కొమరం తనకి అచ్చొచ్చిన కొమరక్క పాత్రలో బాగా మెప్పించాడు. బన్నీ రాజు డాక్టర్ పాత్రలో, ఊళ్ళో మంచోడిగా పర్వాలేదనిపించాడు. కనీకా వాధ్వ అక్కడక్కడా అందాల ఆరబోత చేస్తూనే నటనతో ఒకే అనిపించింది. అమిత్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పిస్తారు.
Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కు తగట్టు బాగానే ఇచ్చారు. పాటలు యావరేజ్. మర్డర్ మిస్టరీ కథకు తెలంగాణ బ్యాక్ డ్రాప్, డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించాడు దర్శకుడు. సినిమా రిలీజ్ ముందే దర్శకుడు మరణించడం బాధాకరం. గ్రాఫిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎడిటింగ్ కూడా కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘బ్రహ్మాండ’ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూసేయొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.