ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి.. లుక్ అదుర్స్..

ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి.. లుక్ అదుర్స్..

Updated On : December 24, 2020 / 1:51 PM IST

Arvind Swami as MGR: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయ పాత్ర పోషిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.

గురువారం ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) వర్థంతి సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్న అరవింద్ స్వామి లుక్ రిలీజ్ చేశారు. సాంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టు, ఎంజీఆర్ మాదిరి టోపితో అరవింద్ స్వామి అచ్చు ఎంజీఆర్‌లా కనిపిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న అరవింద్ స్వామి పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

MGR

ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : విశాల్ విఠల్, నిర్మాణం : విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్.Thalaivi