Nikhil Siddharth: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిఖిల్, మరో సినిమా ‘18 పేజీస్’ను కూడా రెడీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలతో పాటు గ్యారీ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమాను గతేడాది అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
Nikhil Siddharth: కెరీర్ గ్రాఫ్‌లో డౌన్ ఫాల్.. నిఖిల్ ఆశలన్నీ ఈ రెండు సినిమాలే!
కాగా తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు నిఖిల్ అండ్ టీమ్ రెడీ అయ్యారు. నిఖిల్ కెరీర్లో 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఏప్రిల్ 17న ఉదయం 11.11 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు హీరో నిఖిల్ పేర్కొన్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు నిఖిల్. బుల్లెట వర్షం కురవనుందని నిఖిల్ పేర్కొనడంతో ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ మూవీగా రాబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్
ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాను ఈడీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మరి నిఖిల్ నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ఎలాంటి టైటిల్ పెడుతున్నారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Tomorrow 11:11 am it will be RAINING BULLETS…
Our 19th film Title and First Look Tomorrow…
The Target is Locked ?@actor_nikhil @Ishmenon @Garrybh88 @tej_uppalapati @julian_amaru #Edentertainments #kRajashekarreddy #Nikhil19 pic.twitter.com/kUT6nxNKn0— Nikhil Siddhartha (@actor_Nikhil) April 16, 2022