Nikhil Siddharth: కెరీర్ గ్రాఫ్‌లో డౌన్ ఫాల్.. నిఖిల్ ఆశలన్నీ ఈ రెండు సినిమాలే!

2019లో ఫ్లాప్.. 2020 నుంచి కొవిడ్ కారణంగా బిగ్ బ్రేక్. టాలీవుడ్.. లో-ఫేజ్ లో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ కెరీర్ నడుస్తోంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా గట్టిగా..

Nikhil Siddharth: కెరీర్ గ్రాఫ్‌లో డౌన్ ఫాల్.. నిఖిల్ ఆశలన్నీ ఈ రెండు సినిమాలే!

Nikhil Siddharth

Nikhil Siddharth: 2019లో ఫ్లాప్.. 2020 నుంచి కొవిడ్ కారణంగా బిగ్ బ్రేక్. టాలీవుడ్.. లో-ఫేజ్ లో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ కెరీర్ నడుస్తోంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడలాగే చేతిలో ఉన్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు.

Nikhil: సీక్రెట్ రివీల్ చేసేందుకు కార్తికేయ డేట్ ఫిక్స్ చేశాడు!

టాలీవుడ్ యాక్టర్ సిద్ధార్ద్ కి సాలిడ్ హిట్ తగిలి చాలా కాలమే అవుతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే 2014లో రిలీజైన కార్తీకేయ తర్వాత 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత.. మళ్లీ ఇంతవరకు అంతటి సక్సెస్ దక్కలేదు. అందుకే మళ్లీ కార్తీకేయ సినిమాను నమ్ముకుని సీక్వెల్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. జూలై 22న థియేటర్స్ కి వచ్చేలా కార్తీకేయ2 డేట్ లాక్ చేశారు మేకర్స్.

Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్

అప్పుడప్పుడు మెరిపిస్తాడు.. చాలాసార్లు డిస్సప్పాయింట్ చేస్తుంటాడు నిఖిల్ సిద్ధార్ధ్. ఓసారి ఈ హీరో కెరీర్ గ్రాఫ్ చూస్తే.. ఎక్కువ ఫ్లాప్స్ కనిపిస్తాయి. కానీ సినిమాకో కొత్త వేరియేషన్ ట్రై చేయడం నిఖిల్ కి అలవాటు. అయితే సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కేశవ వంటి ప్రయోగాలు కలిసిరాలేదు. అందుకే ఈసారి లేట్ అయినా కార్తీకేయ2, 18 పేజీస్ వంటి డిఫరెంట్ సబ్జెక్టులతో ఆకట్టుకుంటానని గట్టిగా చెప్తున్నాడు.

Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన ’18 పేజీలు’

18 పేజీస్.. డైరెక్టర్ సుకుమార్ రాసిన కథను ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో కలిసి సకుమార్ రైటింగ్స్ కంబైన్డ్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక కార్తీకేయ డైరెక్టర్ చందు మొండేటి.. సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. 2019లో స్టార్ట్ అయిన ఈ మూవీ.. కొవిడ్ కారణంగా చాలా తీసుకుని ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇక నిఖిల్ నమ్ముకున్న 18 పేజీస్, కార్తీకేయ2.. ఈ రెండింటిలోనూ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.