TeamIndia Video: పర్వతాలు, పచ్చనిచెట్ల మధ్య నుంచి చాలా సరదాగా టీమిండియా ప్రయాణం

టీమిండియా న్యూజిలాండ్ లోని నేపియర్ చేరుకుంది. నిన్న మౌంట్ మాంగనుయ్‌ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు నేపియర్‌లోని మెక్‌లీన్‌ పార్క్ లో మూడో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో మౌంట్ మాంగనుయ్‌ నుంచి నేపియర్‌కు భారత ఆటగాళ్లు బస్సులో ప్రయాణించారు.

TeamIndia Video: పర్వతాలు, పచ్చనిచెట్ల మధ్య నుంచి చాలా సరదాగా టీమిండియా ప్రయాణం

TeamIndia Video

Updated On : November 21, 2022 / 8:07 PM IST

TeamIndia Video: టీమిండియా న్యూజిలాండ్ లోని నేపియర్ చేరుకుంది. నిన్న మౌంట్ మాంగనుయ్‌ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు నేపియర్‌లోని మెక్‌లీన్‌ పార్క్ లో మూడో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో మౌంట్ మాంగనుయ్‌ నుంచి నేపియర్‌కు భారత ఆటగాళ్లు బస్సులో ప్రయాణించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను టిమిండియా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందమైన మార్గాలు, పర్వతాలు, పచ్చనిచెట్ల మధ్య నుంచి చాలా సరదాగా ప్రయాణం సాగించిందని పేర్కొంది. టీమిండియా ఆటగాళ్లు బస్సు దిగిన చోట అక్కడి వారు క్రికెటర్లతో ఫొటోలు దిగారు.

కొందరు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఆయన తాత్కాలికంగా చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ద్రవిడ్ కోచింగ్ బృందానికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా టీ20 మ్యాచులు ఆడుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..