Tamil Nadu : 11 ఏళ్లుగా 144 సెక్షన్ అమలువున్న ఆ గ్రామం.. ఎక్కడంటే?

ఆ గ్రామంలో 11 ఏళ్లుగా 144 సెక్షన్ నడుస్తోందట. 2012 లో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చివరికి అధికారులు జరిపిన చర్చలతో గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడంటే?

Tamil Nadu : 11 ఏళ్లుగా 144 సెక్షన్ అమలువున్న ఆ గ్రామం.. ఎక్కడంటే?

Tamil Nadu

Updated On : June 3, 2023 / 11:35 AM IST

Tamil Nadu News : రెండు వర్గాల మధ్య పోరు.. సంవత్సరాల తరబడి ఉద్రిక్తతకు తెరపడింది. దశాబ్దకాలంగా 144 సెక్షన్ అమలౌతున్న ఆ గ్రామంలో నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో శాంతియుత వాతావరణం నెలకొంది. తమిళనాడులో ఆ గ్రామం ఎక్కడంటే?

Tirupati Fires : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది..?! అకారణంగా మంటలు,కాలిపోతున్న ఇళ్లల్లోని వస్తువులు..క్షుద్రపూజలేనంటున్న స్థానికులు

తమిళనాడు కళ్లకురిచి జిల్లాలోని చిన్నసేలం సమీపంలోని పాండంయంకుప్పంలో MBC లు, షెడ్యూల్డ్ కులాలు మరియు అరుంథతియార్లు అనే మూడు సంఘాలు ఉన్నాయి. అయితే వారిలో MBC లు మరియు షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల మధ్య 2012 నుండి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే గ్రామ సభలో నిర్ణయాలు తప్పు దారి పట్టడంతో ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.

 

2012 జూలై 30 న మారియమ్మన్ ఆలయ ఉత్సవాల సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. పీఠాధిపతి రథాన్ని లాగే హక్కుపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పండుగ ప్రశాంతంగా ముగిసినా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వివాదం చెలరేగింది. వివాదం సద్దుమణగకపోవడంతో జిల్లా యంత్రాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 144 అమలు చేసింది.

Jammu And Kashmir: 75ఏళ్ల తరువాత ఆ గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు.. ఆనందంతో గ్రామస్తులంతా కలిసి..

ఎన్నోసార్లు ఇరు వర్గాల మధ్యా రాజీకి ప్రయత్నం చేసినా..హక్కుల కోసం పట్టుబట్టడంతో 11 సంవత్సరాలలో 36 సార్లు ఆ గ్రామంలో నిషేధ ఉత్తర్వులు విధించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పాండియంకుప్పం పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగం  గ్రామసభ యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఇంటింటికి తిరిగారు. శాంతి చర్చల ద్వారా ఇరు వర్గాలు రాజీకి వస్తే నిషేధ ఉత్తర్వులు ఎత్తివేస్తామని కల్లకురిచ్చి కలెక్టర్ శ్రావణ్ కుమార్ వారికి వివరించారు. చివరకు వారు రాజీకి వస్తామని అంగీకరించారు.

 

ఇరు పక్షాలతో సమావేశం నిర్వహించి నిషేధాజ్ఞలు ఎత్తివేసి 11 ఏళ్ల తర్వాత మే 1 న తొలి గ్రామ సభ నిర్వహించారు. సంవత్సరాల తరబడి ఉద్రిక్తత తర్వాత, రెండు సంఘాల సభ్యులు కరచాలనం చేసుకుని గ్రామసభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఆ గ్రామంలో నిర్వహించుకునే తొలి పండుగ కోసం గ్రామస్తులు సంతోషంగా ఎదురుచూస్తున్నారు.