Tirupati Fires : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది..?! అకారణంగా మంటలు,కాలిపోతున్న ఇళ్లల్లోని వస్తువులు..క్షుద్రపూజలేనంటున్న స్థానికులు

మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

Tirupati Fires : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది..?! అకారణంగా మంటలు,కాలిపోతున్న ఇళ్లల్లోని వస్తువులు..క్షుద్రపూజలేనంటున్న స్థానికులు

Tirupati Fires

Tirupati Fire Incidents : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్ల గ్రామంలో మంటల మిస్టరీ వీడడటం లేదు. గత 20 రోజులుగా గ్రామంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అకారణంగా వస్తువులు తగలబడుతున్నాయి. గ్రామంలోని పలు ఇళ్లల్లో వస్తువులు, బట్టలు, కూలర్లు వాషింగ్ మిషన్లలో మంటలు చెలరేగుతున్నాయి. ఇంటి బయట ఉన్న గడ్డి వాములు దగ్ధం అవుతున్నాయి.

గ్రామంపై క్షుద్రపూజలు జరిగాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇటీవల మంత్రగాళ్లను తీసుకువచ్చి గంగమ్మకు పూజలు జరిపించారు. పూజలు చేస్తుండగానే మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 70 మంది పోలీసులతో ఇంటింటి సర్వే నిర్వహించారు.

Fire Accident: కొంపముంచిన కొవ్వొత్తులు: తెనాలి పరిధిలో మూడు అగ్నిప్రమాదాలు

మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. గ్రామంలో ఎప్పటి నుంచి ఉన్నారు? కొత్తగా ఎవరు వచ్చారు? ఎవరి ఇంటిలో మంటలు చెలరేగాయి? వంటి అనేక విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు శాంపుల్స్ సేకరించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని పోలీసులు భరోసా ఇచ్చారు.