Fire Accident: కొంపముంచిన కొవ్వొత్తులు: తెనాలి పరిధిలో మూడు అగ్నిప్రమాదాలు

తెనాలిలోని పాండురంగ పేట, మారిస్ పేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు అగ్నిప్రమాదానికి గురవగా చేబ్రోలు మండలంలో 15 ఎకరాల వారికుప్ప మంటల్లో కాలి బూడిదైంది.

Fire Accident: కొంపముంచిన కొవ్వొత్తులు: తెనాలి పరిధిలో మూడు అగ్నిప్రమాదాలు

Guntur

Fire Accident: గుంటూరు జిల్లా తెనాలిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో భారీ ఆస్థి నష్టం సంభవించింది. తెనాలిలోని పాండురంగ పేట, మారిస్ పేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు అగ్నిప్రమాదానికి గురవగా చేబ్రోలు మండలంలో 15 ఎకరాల వరికుప్ప మంటల్లో కాలి బూడిదైంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..తెనాలిలో రోజు సాయంత్రం 7గంటల నుండి 11 గంటల వరకు కరెంట్ కోతలు ఉంటున్నాయి. ఈక్రమంలో వెలిగించిన కొవ్వుత్తుల కారణంగా ఈ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. పాండురంగ పేటలో కొవ్వొత్తి వెలిగించి కుట్టు మిషన్ పై పెట్టగా పూర్తిగా కరిగి కుట్టు మిషన్ దగ్దమై అనంతరం మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈఘటనలో రెండు ఇళ్ళు దగ్ధం పూర్తిగా దగ్ధం అయ్యాయి.

Also Read:Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

మారిస్ పేటలోనూ కొవ్వుత్తులు వెలిగించి కులర్ పై పెట్టడంతో..అది జారి దిండుపై పడి మంటలు వ్యాపించాయి. ఈఘటనలో మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. మంటలు త్వరితిగతిన వ్యాపించడంతో అదుపుచేయలేని బాధితులు.. బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదాలపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే తెనాలి పరిధిలో ఒక్కటే ఫైర్ ఇంజిన్ ఉండడంతో.. మూడు చోట్ల ఒకేసారి అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అదుపు చేయలేకపోయారు.

Also Read:Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

దీంతో ఆయా ప్రమాదాల్లో భారీగా ఆస్థి నష్టం సంభవించింది. ఇక చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో ప్రమాదవ శాత్తు చెలరేగిన మంటల కారణంగా 15 ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధం అయ్యాయి. మూడు ప్రమాదాల్లోనూ భారీగా ఆస్థి నష్టం సంభవించడంతో పాటు, సర్వం కోల్పోయి బాధితులు రోడ్డున పడ్డారు. స్థానిక నేతలు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.